చోటు దక్కని ఆటగాళ్లు బాధపడొద్దు.. అవకాశం రావొచ్చు: రవిశాస్త్రి

ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో (15 మంది) చోటు దక్కని వారు బాధపడొద్దు. ఆటగాళ్లకు ఎప్పుడైనా గాయాలు కావొచ్చు.. మీకు అవకాశం రావొచ్చు అని టీమిండియా కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇంగ్లాండ్ వేదికగా జరిగే 2019 ప్రపంచకప్ మే 30 నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ సోమవారం జట్టును ప్రకటించింది. నాలుగో స్థానంలో ప్రధానంగా రేసులో ఉన్న అంబటి రాయుడు, యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు 15 మందిలో చోటు దక్కలేదు. దీంతో అభిమానులతో సహా కొందరు మాజీలు కూడా సెలక్టర్లపై విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో తాజాగా కోచ్ రవిశాస్త్రి స్పందించారు.

16 మంది ఎంపికను ఆశించా:
'ప్రపంచకప్ కోసం 16 మంది ఎంపికను ఆశించా.. కానీ ఆలా జరగలేదు. ప్రపంచకప్ టోర్నీ సుదీర్ఘంగా సాగుతుంది. ఇలాంటి టోర్నీలో 16 మంది ఆటగాళ్లయితే బాగుంటుందని సెలక్షన్ వర్గాలతో చెప్పాను. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తోనూ చర్చించాం. అయినా ఐసీసీ 15 మందికే అనుమతి ఇచ్చింది' అని రవిశాస్త్రి తెలిపారు.

నాలుగో స్థానంలో ఎవరికైనా అవకాశం దకొచ్చు:
'ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కని వారు బాధపడొద్దు. ఇదో సరదా ఆట. ఆటగాళ్లకు ఎప్పుడైనా గాయాలు కావొచ్చు.. మీకు ఎప్పుడైనా పిలుపు రావొచ్చు. బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్-3 గురించి ఎలాంటి సందేహం లేదు. ఇక నాలుగో స్థానంలో ఆడే ఆటగాడు పరిస్థితులు, ప్రత్యర్థిని బట్టి ఆడాల్సి ఉంటుంది. అందుకే ఎవరికైనా అవకాశం రావొచ్చు' అని కోచ్ స్పష్టం చేశారు.

ఇంగ్లాండ్ నిలకడగా రాణిస్తోంది:
'గత ఐదేళ్లుగా టీమిండియా అన్ని ఫార్మాట్లలో టాప్-3లో ఉంటోంది. విరాట్ కోహ్లీ ఒక్కడి మీదే అతిగా ఆధారపడితే.. ఇది సాధ్యం కాదు. గత కొంత కాలంగా ఇంగ్లాండ్ నిలకడగా రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో మంచి ఆటగాళ్లు ఉన్నారు. ప్రపంచకప్ సొంతగడ్డపై జరుగుతుండడంతో కలిసొచ్చే అంశం. తమదైన రోజున చెలరేగే జట్లు ప్రపంచకప్‌లో ఉన్నాయి' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications