2003 వరల్డ్ కప్ ఫైనల్ మళ్లీ జరిగితే గెలుపెవరిదో తెలుసా?: సచిన్
హైదరాబాద్: జోహెన్స్‌బర్గ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ 2003 ఫైనల్ అందిరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 125 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. అయితే అదే పైనల్ ఇప్పుడు గనుక జరిగి ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ లెజెండ్ సచిన్ చెప్పుకొచ్చాడు.
టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత ఆటగాళ్లు భారీ లక్ష్యాన్ని ఛేదించే ధోరణి భిన్నంగా ఉందని సచిన్ పేర్కొన్నాడు. 'అప్పటి పైనల్ మ్యాచ్‌ని ఇప్పుడు ఆడేందుకు అనుమతి ఇస్తే, చేధనలో ఆటగాళ్ల ధోరణి మరోలా ఉండేది' అని సచిన్ తెలిపాడు. తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా ప్రమోషన్‌లో భాగంగా విలేకరులతో ఈ అంశంపై సచిన్ స్పందించాడు.

తొలి ఓవర్ నుంచే మాకు వ్యతిరేకం
'ఆ రోజు మ్యాచ్ తొలి ఓవర్ నుంచే మాకు వ్యతిరేకంగా ఉంది. కొన్ని తప్పిదాలను మేమే నమ్మలేకపోయాం. ఆ ఫైనల్లో ఆడిన క్రికెటర్లతో మళ్లీ అదే మ్యాచ్‌ని ఇప్పుడు నిర్వహిస్తే.. భారీ లక్ష్యాన్ని ఛేదించే ధోరణి భిన్నంగా ఉంటుంది' అని సచిన్ వివరించాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ వికెట్ కోల్పోగానే.. భారత్ ఒత్తిడిలో పడిపోయింది' అని సచిన్ అన్నాడు.

పోరాడిన సెహ్వాగ్
'ఒక ఎండ్‌లో సెహ్వాగ్ పోరాడుతున్నా.. గంగూలీ (24), మహ్మద్ కైఫ్ (0), యువరాజ్ సింగ్ (24) వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. అప్పట్లో అది భారీ లక్ష్యమని.. కానీ ప్రస్తుతం టీ20 బాదుడికి అలవాటు పడ్డ క్రికెటర్లకి మాత్రం అది కంగారు పడే టార్గెట్ కాదు' అని సచిన్ వివరించాడు.

ఆస్ట్రేలియాతో ఫైనల్
సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా 2003 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో రికీ పాంటింగ్ (140: 121 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సులు) అజేయ సెంచరీతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది.

125 పరుగుల తేడాతో భారత్ ఓటమి
అనంతరం 360 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒత్తిడికి తలొగ్గి 234 పరుగులకే ఆలౌటైంది. జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ (82: 81 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులు), రాహుల్ ద్రవిడ్ (47) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారీ అంచనాల మధ్య ఓపెనర్‌గా వెళ్లిన సచిన్ టెండూల్కర్ (4) తొలి ఓవర్‌లోనే మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications