చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్లు.. కాసులు కుమ్మరించి కొంటే ఇంత దారుణంగా ఆడతారా..!

ఐపీఎల్ టోర్నీలో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఐపీఎల్లో తొలిసారి ఆడుతున్న గుజరాత్ టైటాన్స్, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాయి. ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి జట్లు గత సీజన్లలో స్టార్లుగా వెలిగాయి. కానీ ప్రస్తుత సీజన్లో పాయింట్ల పట్టికలో అవి అట్టడుగున కొనసాగుతున్నాయి. అలాగే ఈ ఐపీఎల్‌లో పలు జట్లు రిటైన్ చేసుకున్న ప్లేయర్లు కూడా నిరాశపరుచుతున్నారు.
ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి, ముంబై ప్లేయర్ రోహిత్ శర్మ ఈ సీజన్లో కేవలం 20సగటుతో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నారు. కాకపోతే అన్‌క్యాప్డ్ భారత యువ ఆటగాళ్లు చాలా మంది ఈ సీజన్లో రాణిస్తూ వెలుగులోకి వస్తున్నారు. మరోవైపు ఈ ఐపీఎల్లో వేలంలో మంచి ధర దక్కించుకుని.. రాణిస్తారని ఆశలు పెట్టుకున్న ఆటగాళ్లు.. జట్టుకు భారంగా మారుతున్నారు. అలా నిరాశపరిచిన టాప్-5 ప్లేయర్లను ఓసారి పరిశీలిస్తే..

మాథ్యూ వేడ్
ఆసీస్ ప్లేయర్ మాథ్యూ వేడ్.. 2021ప్రపంచ టీ20వరల్డ్‌కప్‌లో భీకరంగా చెలరేగడంతో ఐపీఎల్ వేలంలో అతన్ని కొనేందుకు జట్లు ఆసక్తి చూపించాయి. కొత్త జట్టు గుజరాత్ ఫ్రాంచైజీ అతన్ని దక్కించుకుంది. ఇప్పటివరకు వేడ్ తను ఆడిన 5మ్యాచ్‌ల్లో కేవలం 68పరుగులు మాత్రమే చేశాడు. 13.6 సగటుతో తీవ్రంగా నిరాశపరిచాడు. గుజరాత్ మేనేజ్‌మెంట్ మాథ్యూ వేడ్‌ను రూ.2.4కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దురదృష్టవశాత్తూ వేడ్ మాత్రం అందుకు తగ్గ ప్రదర్శన చేయట్లేదు.

క్రిస్ జోర్డాన్
ఇంగ్లాండ్ స్టార్ పేసర్ క్రిస్ జోర్డాన్‌ను చెన్నై ఫ్రాంచైజీ వేలంలో రూ.3.6కోట్లకు దక్కించుకుంది. డ్వేన్ బ్రావోకు బ్యాకప్ ప్లేయర్‌గా జోర్డాన్ కీలక పాత్ర పోషిస్తాడనుకుంటే.. ఏమాత్రం ప్రభావం చూపని బౌలింగ్‌తో జోర్డాన్ ఫ్లాప్ అయ్యాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన జోర్డాన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అలాగే జోర్డాన్ బౌలింగ్ ఎకానమీ (10.5) కూడా బాగా ఎక్కువగా ఉంది. డెత్ ఓవర్లలో అతను 11.5ఎకానమీతో బౌలింగ్ వేయడం పెద్ద మైనస్ పాయింట్.

విజయ్ శంకర్
గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ అయిన విజయ్ శంకర్ రూ.1.4కోట్లకు అమ్ముడుపోయాడు. గత సీజన్లో విజయ్ శంకర్ సన్‌రైజర్స్‌కు ఆడాడు. ఎస్ఆర్‌హెచ్ టీంలో ఏమాత్రం రాణించని విజయ్ శంకర్ కోటి రూపాయలకు పైగా అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత సీజన్ లాగే తన పేలవ ఫామ్‌ను విజయ్ శంకర్ కొనసాగిస్తున్నాడు. నాలుగు మ్యాచుల్లో కేవలం 19పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు (4.75)తో చాలా పేలవంగా ఉంది.

రోవ్‌మెన్ పావెల్
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రోవ్‌మెన్ పావెల్ ఇటీవల టీమిండియా పర్యటనలో మంచి ప్రదర్శన కనబర్చడంతో అతని కోసం వేలంలో జట్లు పోటీపడ్డాయి. ఢిల్లీ ఫ్రాంచైజీ పావెల్‌ను రూ.2.8కోట్లకు దక్కించుకుంది. కానీ ఆశించినట్లు ఐపీఎల్లో పావెల్ తన మెరుపులు చూపించట్లేదు. ఇప్పటివరకు ఆడిన 5మ్యాచ్‌లలో పావెల్ 6.20సగటుతో కేవలం 31పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్లో ఢిల్లీ స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్ స్థానాన్ని భర్తీ చేస్తాడనుకున్న పావెల్ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు.

మనీష్ పాండే
లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు భారంగా మారాడు మనీష్ పాండే. లక్నో బ్యాటింగ్ లైనప్‌కు సమతూకం తెచ్చే ప్లేయర్‌గా పాండేను జట్టు యాజమాన్యం భావించినా.. అతను మాత్రం హట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. అతను ఆడిన 4మ్యాచ్‌ల్లో కేవలం 60పరుగులు మాత్రమే చేశాడు. 15పరుగుల సగటుతో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మనీష్ పాండేను రూ.4.6కోట్ల భారీ ధరకు లక్నో దక్కించుకుంది. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 38పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించిన పాండే తర్వాతి మ్యాచుల్లోనైనా పుంజుకుంటాడో లేదో.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications