క్రికెట్ ప్రపంచంలో గత కొన్నేళ్లుగా సంపాదనపరంగా కానీ, క్రేజ్ పరంగా గానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. బిగ్‌బాష్ లీగ్, కరేబియన్ లీగ్, పాక్ సూపర్ లీగ్, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లకు కూడా ఈ మధ్య ప్రజాదరణ పెరగింది. దీంతో సౌదీ అరేబియా కూడా ఇదే బాటలో పయనించేందుకు గత రెండేళ్లుగా గట్టిగానే ప్రణాళికలు సిద్ధం చేస్తూనే ఉంది. ఐపీఎల్ కన్నా రిచెస్ట్ లీగ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్త్తోంది రచిస్తోంది. అయితే ఇప్పుడీ ప్రచారం మళ్లీ ఊపందుకుంది. దీంతో సౌదీ అరేబియా అనుకున్నట్టుగానే లీగ్ ను ఏర్పాటు చేస్తే, అది ఐపీఎల్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అసలు ఆ లీగ్ కోసం ఎంత ఖర్చు పెడుతోంది, అందులో భారత ప్లేయర్లు ఆడతారా, ఆ లీగ్ ను ప్రారంభించేందుకు ఐసీసీ అప్రూవల్ ఇస్తుందా అనే ప్రశ్నలు క్రికెట్ అభిమానుల మెదడులో మెదులుతున్నాయి. వాటిని సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సౌదీ అరేబియా.. అతి పెద్ద క్రీడా దేశంగా ఎదిగే దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. అందుకోసం ఇప్పటికే గోల్ఫ్, ఫార్మూలా ఓ, 2034 ఫిఫా వరల్డ్ కప్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతోన్న ఆ దేశం.. ఇప్పుడు టీ20 క్రికెట్ లీగ్ లోనూ అడుగులు వేస్తోంది. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం.. కొంతమంది ఆస్ట్రేలియన్ క్రికెట్ నిపుణులు, ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ తో కలిసి లీగ్ ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వరల్డ్ బిగ్గెస్ట్ టీ20 క్రికెట్ లీగ్ ను సిద్ధం చేయాలని, ప్రాథమికంగా రూ.4,347 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ లీగ్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ నీల్ మ్యాక్స్‌వెల్ గత కొన్నేళ్లుగా బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇప్పుడీ లీగ్ ఏర్పాటు కనుక జరిగితే ఐపీఎల్ కు ఇది గట్టి పోటీ అవుతుందని అందరి చర్చ.
ఫండ్స్ కూడా..
సౌదీ అరేబియన్ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ లీగ్ ను లాంఛ్ చేయనుంది. అలానే కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఈ లీగ్ కోసం ఫండ్స్ ఇవ్వనున్నాయి. 2020 తర్వాత ఫుట్ బాల్, టెన్నిస్, గోల్ఫ్, ఫార్మూలా వన్ రేసింగ్ వంటి క్రీడలపై సౌదీ అరేబియా ఎన్ని బిలియన్లు ఖర్చు చేసింది. అలానే ఫిఫా వరల్డ్ కప్ కూడా హోస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది.
గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌కు సిమిలర్‌గా
ఈ టీ20 లీగ్.. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కు సిమిలర్ గా ఉండనుంది. ముందు 8 జట్లతో ఇది ప్రారంభం కానుంది. ఏడాది మొత్తం జట్లన్నీ ఇతర దేశాల్లో ఆడతాయి. అనంతరం ఫైనల్ ను సౌదీ అరేబియాలో నిర్వహిస్తారు.

ఐపీఎల్ పై ఇంపాక్ట్ చూపిస్తుందా?
ఆసియా ఖండంలో క్రికెట్ కన్నా పెద్ద క్రీడ మరొకటి లేదని సౌదీ అరేబియాకు తెలుసు. కాబట్టి అటువంటి పరిస్థితిలో, వారు క్రికెట్‌లో తమను తాము నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం వారు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్‌ను అధిగమించాల్సి ఉంటుంది. ఐపీఎల్ బ్రాండ్ విలువ ప్రస్తుతం దాదాపు 1.2 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఐపీఎల్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లు ఆడతారు. అందుకే తమ లీగ్ లో కూడా వరల్డ్ వైడ్ గా ఉన్న బడా స్టార్స్ ఆడేందుకు, వారిపై కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో వారు కూడా ఐపీఎల్ కన్నా ఈ కొత్త లీగ్ లోనే ఎక్కువగా ఆడేందుకు ఆసక్తి చూపిస్తారని పలువురి అభిప్రాయం. తద్వారా ఐపీఎల్ పై ఎక్సైట్ మెంట్ కూడా కాస్త తగ్గే అవకాశం ఉంటుందని మరికొంతమంది అభిప్రాయం.
అసలు భారత ప్లేయర్లు ఈ కొత్త లీగ్ లో ఆడతారా?
రూల్స్ ప్రకారం, యాక్టివ్ గా ఉన్న టీమిండియా ప్లేయర్స్ లేదా డొమాస్టిక్ క్రికెటర్స్.. ఇతర ఫారెన్ లీగ్స్ లో ఆడకూడదు. అలా ఆడితే చర్యలు తీసుకుంటుంది. కేవలం మాజీ క్రికెటర్లు మాత్రమే ఇతర విదేశీ లీగ్ లు ఆడే అవకాశాన్ని కల్పించింది. మరి ఈ కొత్త లీగ్ కోసం బీసీసీఐ తన నిబంధనలను మారుస్తుందా లేదా అనేది తెలీదు.
భారత స్టార్ ప్లేయర్లు ఆడకపోతే ఏం జరుగుతుంది?
భారత స్టార్ ప్లేయర్లు తమ లీగ్ లో ఆడకపోతే... సౌదీ అరేబియా వారికి ప్రత్యాయమయంగా ఇతర దేశాలకు చెందిన బడా స్టార్లకు పెద్ద మొత్తంలో చెల్లించి దక్కించుకుంటుంది.
ఐసీసీ అప్రూవల్ ఇస్తుందా?
ప్రపంచంలో ఏ క్రికెట్ లీగ్ ప్రారంభించాలనుకున్నా.. ఐసీసీ ఆమోదం పొందాలి. ఓ లీగ్ ప్లాన్ మొత్తం చూసి, అంతా నియమ, నిబంధనలతో పాటు ప్రమాణాలకు తగ్గట్టుగా సరిగ్గా ఉంటేనే ఐసీసీ ఆమోదం ఇస్తుంది.