వరల్డ్ ఎలెవన్‌పై వెస్టిండీస్ ఘన విజయం

హైదరాబాద్: వెస్టిండీస్ కరీబియన్ దీవుల్లో హరికేన్స్ బీభత్సం కారణంగా పాడైన స్టేడియాల మరమ్మతుల కోసం ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను గురువారం ఐసీసీ నిర్వహించింది. వెస్టిండీస్ vs వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య గురువారం జరిగిన టి20 ఛారిటీ మ్యాచ్‌లో వెస్టిండీస్ 72 పరుగుల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్‌లో తర్వాత బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విండీస్.. స్టార్ ప్లేయర్లున్న ఎలెవన్ జట్టును మట్టికరిపించింది. తద్వారా ఏకైక టీ20 మ్యాచ్‌లో విండీస్ 72 పరుగుల తేడాతో గెలిచింది.
ముందుగా టాస్ గెలిచిన వరల్డ్ ఎలెవెన్ కెప్టెన్ అఫ్రీది ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో విండీస్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
భారీ అంచనాలున్న విండీస్ ఓపెనర్ గేల్(18).. వరల్డ్ ఎలెవెన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. మరో ఎండ్‌లో లెవిస్ మాత్రం బౌలర్లపై విరుచుకుపడి హాఫ్ సెంచరీ సాధించాడు. 26 బంతులను ఎదుర్కొన్న లెవిస్.. ఐదు సిక్సర్లు, ఐదు బౌండరీలతో 58 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మన్లలో శామ్యూల్స్(43), రామ్‌దిన్(44) రాణించగా, చివర్లో రస్సెల్(21) మెరుపులు మెరిపించాడు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ఆరంభించిన వరల్డ్ లెవెన్ విండీస్ బౌలర్ల ధాటికి 127 పరుగులకే ఆలౌట్ అయింది. మేటి ఆటగాళ్లున్న జట్టులో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. శ్రీలంక బ్యాట్స్‌మన్ పెరీరా ఒక్కడే 61 పరుగులతో రాణించాడు. ఈ జట్టులో భారత్ తరపున ఆడిన దినేష్ కార్తీక్(0) దారుణంగా విఫలమయ్యాడు. విండీస్ బౌలర్లలో విలియమ్స్ మూడు, రస్సెల్, బద్రీ తలో రెండు వికెట్లుతో రాణించారు. మెరుపు హాఫ్ సెంచరీ చేసిన లెవిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వరల్డ్ లెవెన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు, మాలిక్, అఫ్రీది తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications