Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కరోనా సెగ.. ఆసియా XI, ప్రపంచ XI మ్యాచులు వాయిదా!!

World XI vs Asia XI matches postponed amid coronavirus fears

ఢాకా: ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కొవిడ్-19) హైరానా పుట్టిస్తున్నది. కరోనా కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని అదే బాట పడుతున్నాయి. ఈ కరోనా ప్రభావం ఇప్పుడు క్రికెట్‌పై కూడా పడింది. కరోనా కారణంగా బంగ్లాదేశ్‌ ఘనంగా నిర్వహించాలనుకున్న ఆసియా XI, ప్రపంచ XI టీ20 మ్యాచులు వాయిదా పడ్డాయి. ఈ టోర్నీని వాయిదా వేస్తున్నామని బంగ్లాదేశ్ క్రికెట్‌ సంఘం (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

 మ్యాచులు వాయిదా:

మ్యాచులు వాయిదా:

నజ్ముల్‌ హసన్‌ మాట్లాడుతూ... 'ఈ నెల 18న సంగీత విభావరి ఏర్పాటు చేయాలనుకున్నాం. సంగీత విభావరిని భారీ స్థాయిలో జరపాలని నిర్ణయించాం. అయితే ఇప్పుడు 18న జరగడం లేదు. 21, 22న మ్యాచుల నిర్వహణకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిర్వహణలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఆటగాళ్లు బంగ్లాకు తప్పక వస్తారనడంలో సందేహం లేదు. కానీ.. ఇప్పుడు మేం సంగీత విభావరి, మ్యాచులను వాయిదా వేస్తున్నాం. రెండు మూడు నెలల తర్వాత పరిస్థితిని సమీక్షించి టోర్నీని నిర్వహించాలనుకుంటున్నాం' అని చెప్పారు.

మూడు కరోనా పాజిటివ్‌ కేసులు:

మూడు కరోనా పాజిటివ్‌ కేసులు:

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఆదివారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరిని క్వారంటైన్‌కు పంపించారని ఢాకా ట్రిబ్యూన్‌ తాజాగా తెలిపింది. మరోవైపు ప్రపంచ అన్ని దేశాలలో కూడా కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఆసియా XI, ప్రపంచ XI జట్లలో అన్ని దేశాల క్రికెటర్లు ఉన్నారు కాబట్టి ఎటువంటి హాని జరగకుండా బీసీబీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.

షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ శత జయంతి సందర్భంగా:

షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ శత జయంతి సందర్భంగా:

బంగ్లాదేశ్‌ పితామహుడు షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ శత జయంతిని పురస్కరించుకొని బీసీబీ ఈ టోర్నీని ఘనంగా నిర్ణయించాలని నిర్ణయించింది. మార్చి 21, 22న ఆసియా XI, ప్రపంచ XIతో భారీ స్థాయిలో రెండు టీ20లు నిర్వహించాలని బీసీబీ ప్లాన్ చేసింది. ముందుగా ఐసీసీ నుంచి అనుమతి తీసుకుంది. ఇక ఈ టోర్నీ కోసం ఆటగాళ్లను పంపించాలని ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులకు లేఖలు రాసింది.

 కోహ్లీ సహా ఐదుగురు:

కోహ్లీ సహా ఐదుగురు:

టీమిండియా విరాట్‌ కోహ్లీ సహా ఐదుగురు క్రికెటర్లను ఆసియా XI జట్టులో ఆడేందుకు అనుమతివ్వాలని బీసీసీఐని బీసీబీ కోరింది. అందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా అనుమతి ఇచ్చాడు. మ్యాచుల కన్నా ముందు భారత స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌తో సంగీత విభావరి ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. అయితే కరోనా వైరస్‌ కారణంగా బీసీబీ అన్నింటిని వాయిదా వేయక తప్పలేదు. కరోనా వల్ల వాయిదాపడ్డ తొలి క్రికెట్‌ టోర్నీ ఇదే కావొచ్చని తెలుస్తోంది.

Story first published: Thursday, March 12, 2020, 8:58 [IST]
Other articles published on Mar 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+