డివిలియర్స్ విధ్వంసం: పోరాడి ఓడిన అఫ్ఘాన్(పిక్చర్స్)
ముంబై: ఆకాశమే హద్దుగా చెలరేగిన దక్షిణాఫ్రికా విధ్వంసకారుడు ఏబీ డివిలియర్స్ 64(29 బంతుల్లో 4×4, 5×6) తో చెలరేగిపోయాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై విజయం సాధించి తొలి గెలుపు నమోదు చేసింది. పసికూన అయినా ఆఫ్గనిస్థాన్ జట్టు ఆటగాళ్లు కూడా గెలుచేందుకు చివరి వరకు పోరాడారు.
టీ20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ని దక్షిణాఫ్రికా 37 పరుగుల తేడాతో గెల్చుకుంది. స్టార్ బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్ అర్ధ శతకంతో జట్టు విజయానికి పునాది వేశాడు. బౌలర్ క్రిస్ మోరిస్ నాలుగు వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పరాజయాన్ని శాసించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
మొదట టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను ఎంచుకొని, 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. క్వింటన్ డికాక్ 31, కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ 41 పరుగులతో రాణించారు. డివిలియర్స్ 29 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 64 పరుగులు సాధించాడు.
అఫ్గాన్ బౌలర్లలో అమీర్ హంజా, దౌలత్ జద్రాన్, షాపూర్ జద్రాన్, మహమ్మద్ నబీ తలా ఒక్కో వికెట్ కూల్చారు. దక్షిణాఫ్రికాను ఓడించడానికి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉన్నప్పటికీ అఫ్గాన్ జట్టు శక్తివంచన లేకుండా కృషి చేసింది.
అయితే, లక్ష్యాన్ని ఛేదించలేక 172 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ షెజాదీ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, గుల్బదీన్ నయిబ్ 26, సలీముల్లా హెర్వానీ 25 చొప్పున పరుగులు చేశారు. మిగతా వారంతా ఎంత శ్రమించినా చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోయారు.
దక్షిణాఫ్రికా బౌలర్ క్రిస్ మోరిస్ 27 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీశాడు. కాగిసో రబద, కేల్ అబోట్, ఇమ్రాన్ తాహిర్‌లకు తలా రెండు వికెట్లు లభించాయి.

పోరాడిన అఫ్ఘాన్ బ్యాట్స్‌మన్ షెజాదీ
టీ20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ని దక్షిణాఫ్రికా 37 పరుగుల తేడాతో గెల్చుకుంది.

సఫారీల విజయానందం
స్టార్ బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్ అర్ధ శతకంతో జట్టు విజయానికి పునాది వేశాడు. బౌలర్ క్రిస్ మోరిస్ నాలుగు వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పరాజయాన్ని శాసించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

వికెట్ తీసిన మోరీస్
మొదట టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను ఎంచుకొని, 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

అఫ్ఘాన్ బ్యాట్స్‌మన్ ఔట్
క్వింటన్ డికాక్ 31, కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ 41 పరుగులతో రాణించారు. డివిలియర్స్ 29 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 64 పరుగులు సాధించాడు.

డివిలియర్స్ విధ్వంసం
అఫ్గాన్ బౌలర్లలో అమీర్ హంజా, దౌలత్ జద్రాన్, షాపూర్ జద్రాన్, మహమ్మద్ నబీ తలా ఒక్కో వికెట్ కూల్చారు. దక్షిణాఫ్రికాను ఓడించడానికి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉన్నప్పటికీ అఫ్గాన్ జట్టు శక్తివంచన లేకుండా కృషి చేసింది.

డివిలియర్స్ విధ్వంసం
అయితే, లక్ష్యాన్ని ఛేదించలేక 172 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ షెజాదీ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, గుల్బదీన్ నయిబ్ 26, సలీముల్లా హెర్వానీ 25 చొప్పున పరుగులు చేశారు. మిగతా వారంతా ఎంత శ్రమించినా చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications