Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ స్నేహితుల వ్యూహం ప్రతివ్యూహం: గేల్ వర్సెస్ కోహ్లీ

ముంబై: వాంఖేడే స్టేడియంలో జరగనున్న వెస్టిండీస్ - భారత్ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశముంది. ఇటీవల దక్షిణాఫ్రికా - ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన ట్వంటీ 20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌‌లో 40 ఓవర్లలో ఏకంగా 459 పరుగులు వచ్చాయి. అదే పిచ్ పైన గురువారం సెమీఫైనల్లో భారత్ - వెస్టిండీస్ తలపడనున్నాయి.

వాంఖడె పిచ్‌ సహజంగా ఎలా స్పందిస్తుందో సెమీస్‌లోనూ అలాగే ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ స్థాయిలో పరిస్థితులు బ్యాట్స్‌మెన్‌కు మరీ ఏకపక్షంగా ఉండకపోవచ్చంటున్నారు. గత మ్యాచ్‌లతో పోలిస్తే వికెట్‌ కాస్త నెమ్మదిగా ఉండొచ్చునని భావిస్తున్నారు. పరుగులు మాత్రం బాగానే రావొచ్చంటున్నారు.

World Twenty20: Chris Gayle targets big score in semi final

ఇరుజట్లలోను సునామీ బ్యాట్సుమెన్ ఉన్న విషయం తెలిసిందే. భారత్ తరఫున విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. భారత్ సెమీ ఫైనల్లోకి వచ్చిందంటే కోహ్లీయే కారణం. మరోవైపు, విండీస్‌లో క్రిస్ గేల్ రెచ్చిపోతే ఆపడం కష్టమే. గేల్‌తో పాటు మరికొందర్ని ఆపాల్సి ఉంటుంది.

కాగా, ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో భారత్‌-వెస్టిండీస్‌ సెమీ ఫైనల్‌కు క్రిస్‌ బ్రాడ్‌ రిఫరీగా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌కు రిచర్డ్‌ కెటిల్ బరో, ఇయాన్‌ గౌల్డ్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరిస్తారు. మారిస్‌ ఎరాస్మస్‌ మూడో అంపైర్‌ బాధ్యతలు నిర్వర్తించునున్నాడు.

వ్యూహ, ప్రతివ్యూహాలు

కాగా, వెస్టిండీస్, భారత్.. రెండు జట్లలోని ఆటగాళ్లకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకరు ప్రతిభను ప్రదర్శిస్తే మరొకరు అభినందించుకుంటారు. తెర వెనుక జరిగే పార్టీలను రెండు జట్ల ఆటగాళ్లు ఒక్కటిగా ఎంజాయ్ చేస్తారు.

ఐపీఎల్లో మెజారిటీ ఆటగాళ్లు ఆడుతుండడంతో వారి బలాలు, బలహీనతలు ఒకరికొకరికి తెలుసు. దీంతో ఒక్కక్కరికి ఒక్కొక్కలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండు జట్లలో ఆటగాళ్లు ఎంత మంది ఉన్నప్పటికీ ప్రధానంగా క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ మధ్యే పోరాటం నెలకొంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.

ధోనీ విండీస్ స్టార్ బ్యాట్స్ మన్ గేల్‌కు అడ్డుకట్ట వేసే బాధ్యతను అశ్విన్, జడేజాకు అప్పగించనున్నాడు. గేల్‌కు వారు ముకుతాడు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో లెగ్ సైడ్ షార్ట్ పిచ్ బంతులు ఎదుర్కోవడంలో కోహ్లీ బలం తెలిసిన విండీస్ ఆటగాళ్లు అతని బలహీనతపై దృష్టిసారించారు.

ఏమాత్రం తప్పు చేసినా మ్యాచ్‌ను అమాంతం లాగేసుకుంటాడని కెప్టెన్ సమీ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. కెప్టెన్ సమీ స్వతహాగా బౌలర్ కావడంతో కోహ్లీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గేల్, కోహ్లీపై ప్రధానంగా దృష్టి పెట్టిన రెండు జట్ల ఆటగాళ్లు ఇతరులను కూడా అశ్రద్ధ చేయడం లేదు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+