బద్రీ, ఫ్లెచర్ మాయ: సెమీస్‌కు విండీస్! గేల్ ఫ్యాన్స్ నిరాశ
బెంగళూరు: మంచి ఫాంలో ఉన్న వెస్టిండీస్ ఆదివారం నాడు రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచులో నెగ్గి, సెమీ ఫైనల్ దిశగా దూసుకెళ్తోంది. వెస్టిండీస్ వరుసగా రెండో మ్యాచులోని గెలిచింది. ఫ్లెచ్చర్ అదరగొట్టాడు.
వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 122 పరుగులు చేసింది. 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 18.2 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి దానిని చేధించింది. వెస్టిండీస్ 127 పరుగులు చేసింది.
స్పిన్నర్ బద్రీ (3/12), ఓపెనర్ ఫ్లెచర్ (34 బంతుల్లో 84 నాటౌట్‌గా ) మెరవడంతో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. బద్రీతో పాటు బెన్ (0/13), డ్వేన్ బ్రావో (2/20) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదట శ్రీలంక 9 వికెట్లకు 122 పరుగులే చేయగలిగింది.
శ్రీలంక జట్టులో తిసార పెరీరా (29 బంతుల్లో 40 పరుగులు) టాప్ స్కోరర్. గాయంతో క్రిస్ గేల్ బ్యాటింగ్‌కు దిగకున్నా.. ఫ్లెచర్ చక్కని ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని విండీస్ గెలిచింది. ఫ్లెచర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై గెలిచిన విండీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక ఆ జట్టు ఆడాల్సింది దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌లతోనే. కనీసం అఫ్గాన్‌పై గెలిచినా విండీస్ దాదాపుగా సెమీస్ చేరినట్లే.

శ్రీలంకపై విండీసి గెలుపు
క్రిస్ గేల్‌కు గాయం కావడంతో చార్లెస్‌తో కలిసి ఫ్లెచర్ విండీస్ ఛేదన ఆరంభించాడు. ధారాళంగా పరుగులు రాకున్నా.. చార్లెస్ (10), శామ్యూల్స్ (3), రామ్‌దిన్ (5) విఫలమైనా.. ఫ్లెచర్ నిలబడడంతో విండీస్ గెలిచింది.

శ్రీలంకపై విండీసి గెలుపు
విండీస్ 13 ఓవర్లలో 72/3తో నిలిచింది. ఆ దశలో రసెల్ (8 బంతుల్లో 20 నాటౌట్)తో కలిసి మరింత దూకుడుగా ఆడిన ఫ్లెచర్ శ్రీలంకకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

శ్రీలంకపై విండీసి గెలుపు
రసెల్‌తో అభేద్యమైన నాలుగో వికెట్‌కు ఫ్లెచర్ 55 పరుగులు జోడించాడు. క్రిస్ గేల్ బ్యాటింగ్‌కు దిగకపోవడంతో చిన్నస్వామి స్టేడియంలో అభిమానులు నిరాశచెందారు. గేల్ గాయం తీవ్రమైందేమీ కాదని విండీస్ తెలిపింది.

శ్రీలంకపై విండీసి గెలుపు
మొదట విండీస్ స్పిన్‌తో శ్రీలంకను ఇబ్బంది పెట్టింది. రెండో ఓవర్ నుంచే స్పిన్ దాడి ఆరంభించింది. లెగ్ స్పిన్నర్ బద్రి విజృంభించడంతో లంక 47 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

శ్రీలంకపై విండీసి గెలుపు
కష్టాల్లో ఉన్న జట్టును పెరీరా, మాథ్యూస్ (32 బంతుల్లో 20) ఆదుకున్నారు. ఐతే ఎడమచేతి వాటం స్పిన్నర్ బెన్ బౌలింగ్‌లో పరుగులు చేయడం మరీ కష్టమైపోయింది.

శ్రీలంకపై విండీసి గెలుపు
తొలి మూడు ఓవర్లలో అతడు కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. ఆరో వికెట్‌కు 44 పరుగులు జోడించాక 17వ ఓవర్లో మాథ్యూస్ ఔటయ్యాడు. ఆ తర్వాత పెరీరా కాస్త బ్యాట్ ఝుళిపించడంతో లంక కాస్త గౌరవప్రదమైన స్కోరు అందుకోగలిగింది. పెరీరా ఆఖరి ఓవర్లో 9వ వికెట్‌గా నిష్క్రమించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications