బంగ్లాదేశ్‌పై 'కంగారు'గా గెలిచిన ఆస్ట్రేలియా
బెంగళూరు: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ పైన కష్టపడి గెలిచింది. బంగ్లాదేశ్ ఫీల్డింగ్ వైఫల్యం కూడా ఆసిస్ గెలుపుకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ ప్లేయర్లు కొన్ని క్యాచ్‌లు మిస్ చేశారు. ఇది ఆసిస్‌కు కలిసి వచ్చింది.
ఇటు బౌలింగ్‌లో, అటు బ్యాటింగ్‌లో మంచి ఆరంభాలు దక్కినా ఆస్ట్రేలియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. సునాయాసంగా బంగ్లాను ఓడించేలా కనిపించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత కష్టం మీద గెలిచింది. ఉస్మాన్ ఖవాజా (45 బంతుల్లో 58) మెరుపు ఆరంభాన్నివ్వడంతో ఆసిస్ తొలుత దూసుకెళ్లింది.
షకిబ్ (3/27), ముస్తాఫిజుర్ (2/30) కళ్లెం వేశారు. ఓ దశలో బంగ్లాకు కూడా విజయంపై కాస్త ఆశలు మొలిచాయి. అయితే మాక్స్‌వెల్ (15 బంతుల్లో 26 పరుగులు) ఆసీస్‌ను గట్టెక్కించాడు. అంతకుముందు బంగ్లా 5 వికెట్లకు 156 పరుగులు చేసింది.
ఆ రెండు క్యాచ్‌లు కొంపముంచాయి
చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ వరుసగా రెండో ఓటమితో సెమీస్ అవకాశాలు దాదాపు కోల్పోయింది. అయితే తమ జట్టు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలే ఓటమికి కారణాలు అని బంగ్లా కెప్టెన్ ముష్రాఫే మొర్తజా అన్నాడు.
షేన్ వాట్సన్, జాన్ హేస్టింగ్స్ ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా విజయం తమ జట్టుదేనని అతను అభిప్రాయపడ్డాడు. తమ జట్టు 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 156 పరుగులు చేసినా, ఫీల్డింగ్ లోపాల వల్ల ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యామన్నాడు.

ఆసిస్-బంగ్లా మ్యాచ్
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆడమ్ జంపా (3/23)కు దక్కింది. జంపా బంగ్లాకు కళ్లెం వేసినప్పటికీ మహ్మదుల్లా (29 బంతుల్లో 49) జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. బంగ్లాదేశ్ 156 పరుగులు చేసింది. ఆ తర్వాత 157 పరుగుల లక్ష్యంతో ఆసిస్ బరిలోకి దిగింది.

ఆసిస్-బంగ్లా మ్యాచ్
షేన్ వాట్సన్ (15 బంతుల్లో 21 పరుగులు) ఆరంభంలో నెమ్మదిగానే ఆడినా.. మరో ఓపెనర్ ఖవాజా మాత్రం చెలరేగిపోయాడు. 11 ఓవర్లకు ఆస్ట్రేలియా.. వాట్సన్ వికెట్ మాత్రమే కోల్పోయి 94 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.

ఆసిస్-బంగ్లా మ్యాచ్
ఈ దశలో బంగ్లా బౌలర్లు పుంజుకుని 4 ఓవర్ల వ్యవధిలో స్మిత్ (14), ఖవాజా, వార్నర్ (17) వికెట్లు తీసి.. తమ జట్టును రేసులోకి తెచ్చారు. అయితే మాక్స్‌వెల్‌ను మాత్రం బంగ్లా ఆపలేకపోయింది. వికెట్ల పతనం ఆ తర్వాత కూడా కొనసాగినా.. మాక్స్‌వెల్ మెరుపులతో ఆస్ట్రేలియా విజయానికి చేరువైంది.

ఆసిస్-బంగ్లా మ్యాచ్
అంతకుముందు బంగ్లాదేశ్ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి కంగారూల ముందు మెరుగైన లక్ష్యమే నిలపగలిగింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ తమీమ్ అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

ఆసిస్-బంగ్లా మ్యాచ్
దీనికి తోడు ఆ జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. సౌమ్య సర్కార్ (1), షబ్బీర్ రెహ్మాన్ (12)లను ఔట్ చేసిన వాట్సన్ (2/31).. బంగ్లాను గట్టి దెబ్బ తీశాడు.

ఆసిస్-బంగ్లా మ్యాచ్
నిలకడగా ఆడుతున్న మిథున్ (23) కూడా వెనుదిరగడంతో 3 వికెట్లు కోల్పోయి 64 పరుగులే చేసింది. అయితే ఆ తర్వాత బంగ్లా స్కోరు దూసుకెళ్లింది.

ఆసిస్-బంగ్లా మ్యాచ్
ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మదుల్లా.. షకిబ్ (25 బంతుల్లో 33 పరుగులు), ముఫ్షికర్ (15 నాటౌట్)లతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరి 10 ఓవర్లలో బంగ్లా 92 పరుగులు చేయడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications