WTC 2022: పాక్‌పై శ్రీలంక గెలిచిన అనంతరం టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఈ మార్పులు.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే..?

శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 246పరుగుల భారీ తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. ఇక చివరి ఇన్నింగ్స్‌లో పాక్ ముందు 508పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన శ్రీలంక.. బౌలింగ్లో ప్రతాపం చూపించి.. పాక్‌ను చివరి రోజు 261పరుగులకే ఆలౌట్ చేసింది. శ్రీలంక స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్య 5వికెట్ల హాల్ సాధించి పాక్ పతనాన్ని శాసించగా.. అతనికి తోడు రమేష్ మెండిస్ సైతం 4వికెట్లు పడగొట్టి పాక్‌ను దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ రిజల్ట్ అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. అవేంటో ఓసారి చూసేద్దామా..!

కొనసాగుతున్న దక్షిణాఫ్రికా ఆధిపత్యం
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఆ జట్టు (71.43శాతం విన్నింగ్ పర్సంటేజీ)తో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక ఆస్ట్రేలియా సైతం యథావిధిగా తన రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు 6విజయాలతో (70శాతం విన్నింగ్ పర్సంటేజీ)తో స్వల్ప మార్జిన్ తేడాతో దక్షిణాఫ్రికా తర్వాత కొనసాగుతుంది. ఇకపోతే పాకిస్థాన్‌తో తొలి టెస్టులో ఓడిపోయిన శ్రీలంక.. ఆరోస్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఇక తాజా విజయంతో మళ్లీ మూడు స్థానాలు ఆ జట్టు ఎగబాకింది. తద్వారా ఆరో ర్యాంక్ నుంచి మూడో ర్యాంక్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఆ జట్టు (53.33 విన్నింగ్ పర్సంటేజీ)తో ఉంది.

తరచుగా భారత్ స్థానంలో మార్పు
ఇక ఎప్పటిలాగే భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఇటీవల భారత ర్యాంకు శ్రీలంక ఆడుతున్న టెస్ట్ మ్యాచ్‌ల బట్టి తరచూ మారుతుంది. శ్రీలంక ఇటీవల ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లతో ఆడిన టెస్ట్ విజయాలను బట్టి భారత్ 3, 4, 5స్థానాల్లో తరచూ ఛేంజ్ అవుతుంది. ప్రస్తుతం ఇండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా 12 మ్యాచ్‌లు ఆడగా అందులో ఆరు గెలిచింది. 4ఓడిపోయింది. 2డ్రా అయ్యాయి. భారత్ విన్నింగ్ పర్సంటేజీ శ్రీలంక కంటే కాస్త తక్కువగా (52.08విన్నింగ్ పర్సంటేజీ) కలిగి ఉంది.

రెండు స్థానాలు దిగజారిన పాక్
ఇక తాజా ఓటమితో పాకిస్థాన్ రెండు స్థానాలు దిగజారింది. 3వ స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు విన్నింగ్ పర్సంటేజీ 51.85గా ఉంది. ఇకపోతే ఈ టెస్ట్‌కు ముందు అయిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్ ఒక స్థానం దిగజారి ఆరో స్థానానికి చేరుకుంది. ఆ జట్టు విన్నింగ్ పర్సంటేజీ 50. ఇక చివర్లో వరుసగా 7, 8, 9 స్థానాల్లో ఇంగ్లాండ్ (33.33), న్యూజిలాండ్ (25.93), బంగ్లాదేశ్ (13.13) విన్నింగ్ పర్సంటేజీలతో కొనసాగుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications