న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Test Championship: న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ సిరీస్ విజయం తర్వాత ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే?

World Test Championship: After England series win over New Zealand teams positions like this

నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో టెస్టులో న్యూజిలాండ్‌ను 5వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఓడించి 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 2021 జనవరి తర్వాత ఇంగ్లాంగ్ తమ మొదటి టెస్ట్ సిరీస్‌ను మంగళవారం గెలుచుకుంది. ఇక పోతే జూన్ 23-27నుండి లీడ్స్‌లోని హెడింగ్లీలో జరగనున్న మూడోది మరియు చివరిదైన టెస్టులో కూడా గెలిచి 3-0తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని ఇంగ్లాండ్ చూస్తుంది. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో కూడా మరో స్థానానికి ఎగబాకాలని చూస్తోంది

అగ్రస్థానంలో ఆస్ట్రేలియా

అగ్రస్థానంలో ఆస్ట్రేలియా

ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా 72పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక ఆస్ట్రేలియా విజయ శాతం 75శాతంగా ఉంది. ఇక పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు యాషెస్‌ సిరీస్లో ఇంగ్లాండ్‌ను 4-0తేడాతో ఓడించింది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ మీద కూడా విజయం సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తుంది.

రెండు, మూడు స్థానాల్లో దక్షిణాఫ్రికా, భారత్

రెండు, మూడు స్థానాల్లో దక్షిణాఫ్రికా, భారత్

ఇక దక్షిణాఫ్రికా, భారతదేశం వరుసగా 71.43, 58.33 విజయ శాతాలతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. గతేడాది జరిగిన టెస్టు సిరీస్‌‌లో 2-1తేడాతో ఇంగ్లాండ్ మీద భారత్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక రీషెడ్యూల్ చేసిన చివరిది, అయిదోది అయిన టెస్టులో భారత్ ఇంగ్లాండ్‌తో ఈ నెల చివర్లో తలపడనుంది. అప్పట్లో టీమిండియా శిబిరంలో కోవిడ్ కేసులు వెలుగుచూడడంతో అయిదో టెస్ట్ రద్దయిన సంగతి తెలిసిందే.

అట్టడుగు నుంచి రెండు, మూడు స్థానాల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్

అట్టడుగు నుంచి రెండు, మూడు స్థానాల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్

ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో శ్రీలంక (55.5 విజయశాతం), పాకిస్థాన్ (52.3 విజయశాతం) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక వెస్టిండీస్ 35.71విజయ శాతంతో ఆరో స్థానంలో ఉంది. WTC హోల్డర్స్ అయిన న్యూజిలాండ్ ఏడో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ 29.17విజయ శాతంతో 7వ ప్లేస్‌కు చేరుకుంది.

ఇక న్యూజిలాండ్‌తో తొలి రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో (ఎనిమిదో) స్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లాండ్ విజయ శాతం 24గా ఉంది. ఇక బంగ్లాదేశ్ WTC పట్టికలో అట్టడుగున కొనసాగుతుంది. ఇప్పటివరకు ఆ దేశం కేవలం ఒక గేమ్‌ మాత్రమే గెలిచింది. ఆ జట్టు విజయశాతం కేవలం 16.67గా ఉండడం గమనార్హం.

Story first published: Wednesday, June 15, 2022, 19:31 [IST]
Other articles published on Jun 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X