For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సరికొత్త చరిత్రకు శ్రీకారం: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గురించి తెలుసుకోండి

World Test Championship 2019-21: All you need to know about World Cup of Test cricket

హైదరాబాద్: రెండు శతాబ్దాల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ వినూత్న సమరానికి రంగం సిద్ధమైంది. సంప్రదాయ టెస్టు క్రికెట్ అభిమానులకు మరింత చేరువ చేసేందుకు ఐసీసీ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేక లీగ్ నిర్వహించడానికి మూడేళ్ల కార్యక్రమానికి ఐసీసీ రూపకల్పన చేసింది.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

న్యూజిలాండ్‌‌లోని అక్లాండ్ వేదికగా గతేడాది జరిగిన ఐసీసీ బోర్డు వార్షిక సమావేశంలో ఛైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలోని ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టెస్ట్ హోదా పొందిన తొమ్మిది జట్లతో టెస్ట్ క్రికెట్ లీగ్‌ను ఐసీసీ నిర్వహిస్తోంది.

మొత్తం రెండేళ్లపాటు జరిగే ఈ లీగ్‌లో మూడు స్వదేశీ సిరీస్‌లు, మూడు విదేశీ సిరీస్‌లుగా నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే మొత్తం తొమ్మిది జట్ల మధ్య 27 ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించనున్న ఐసీసీ చివరకు ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతను నిర్ణయిస్తుంది.

టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా

టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా

ప్రస్తుతం టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా, రెండో ర్యాంకలో ఉన్న న్యూజిలాండ్, మూడో ర్యాంకులో ఉన్న దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికాతో పాటు పాకిస్థాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటాయి. ఈ ఐసీస టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ఆగస్టు 1న ప్రారంభమయ్యే యాషెస్ టెస్టు సిరిస్‌తో ఐసీసీ శ్రీకారం చుట్టింది. 2019 ఆగస్టు 1 నుంచి 2021 ఏప్రిల్ 30 మధ్య కాలంలో ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లీగ్ జరగనుంది. బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న తొలి యాషెస్ టెస్టుతో ఈ లీగ్‌కు తెరలేవనుంది.

స్వదేశంలో మూడు, విదేశాల్లో మూడు సిరిస్‌లు

స్వదేశంలో మూడు, విదేశాల్లో మూడు సిరిస్‌లు

టెస్టు హోదాను కలిగి ఉన్న మొత్తం 9 దేశాలు కూడా స్వదేశంలో మూడు, విదేశాల్లో మూడు సిరిస్‌లు ఆడతాయి. ఈ సిరీస్‌ల్లో అత్యధిక పాయింట్లు సాధించిన మొదటి రెండు జట్లు ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా 2021 జూన్‌లో జరిగే ఫైనల్లో తలపడతాయి. ఇరు జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌తో సంబంధం లేకుండా 120 పాయింట్లు చొప్పున ఐసీసీ కేటాయించింది. దీంతో ఒక్కో జట్టుకు అత్యధికంగా 720 పాయింట్లు సాధించే అవకాశం ఉంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా టీమండియా తన సిరిస్‌ను కరేబియన్ పర్యటనతో ప్రారంభించనుంది.

సోమవారం వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా

సోమవారం వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా

సోమవారం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌తో టీమిండియా టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2019 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా వేదికగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాతో తలపడనుంది. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 2020 ఫిబ్రవరి-మార్చి నెలలో న్యూజిలాండ్ వేదికగా జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ తలపడనుంది.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మ్యాచ్‌లు

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మ్యాచ్‌లు

ఆ తర్వాత 2020 నవంబర్ నుంచి 2021 జనవరి మధ్య కాలంలో ఆసీస్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కోహ్లీసేన తలపడనుంది. 2021 జనవరి-మార్చి మధ్యకాలంలో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌తో టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ముగుస్తుంది.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మ్యాచ్‌లు:

ఆగస్టు-సెప్టెంబర్ 2019

వెస్టిండీస్ (దూరంగా) | 2 టెస్టులు

అక్టోబర్ 2019

దక్షిణాఫ్రికా (హోమ్) | 3 టెస్టులు

నవంబర్ 2019

బంగ్లాదేశ్ (హోమ్) | 2 టెస్టులు

ఫిబ్రవరి 2020

న్యూజిలాండ్ (దూరంగా) | 2 టెస్టులు

నవంబర్ 2020-జనవరి 2021

ఆస్ట్రేలియా (దూరంగా) | 4 టెస్టులు

జనవరి-మార్చి 2021

ఇంగ్లాండ్ (హోమ్) | 5 టెస్టులు

Story first published: Monday, July 29, 2019, 13:13 [IST]
Other articles published on Jul 29, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+