Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అఫ్రిది కోసం భారత్ ఫ్యాన్స్ వచ్చారు, మాలిక్ రంగేలీ

మొహాలీ: మన దాయాది పాకిస్తాన్ ఈ రోజు (మార్చి 25)న ఆస్ట్రేలియాతో మొహాలీలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ నుంచి పాక్‌కు ఒకింత మద్దతు లభిస్తోంది. మ్యాచ్ మధ్యాహ్నం ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభం సమయంలో కొందరు క్రికెట్ అభిమానులు పాకిస్తాన్‌కు, అఫ్రిదికి మద్దతుగా నినాదాలు చేశారు.

పాకిస్తాన్ గెలుస్తుందని, అఫ్రిది.. అప్రిది అంటూ నినాదాలు చేశారు. మొహాలీ స్టేడియం కెపాసిటీ 27వేలు. న్యూజిలాండుతో జరిగిన మ్యాచ్‌లోను అఫ్రిది సేనకు మద్దతు లభించింది.

Shahid Afridi

ఔరంగాబాద్ నుంచి వచ్చిన ఓ అభిమాని అమిర్ మాట్లాడుతూ... మేమ అఫ్రిది కోసం మ్యాచ్ చూసేందుకు వచ్చామని చెప్పారు.

మరో అభిమాని మాట్లాడుతూ... అఫ్రిదికి ఇది చివరి మ్యాచ్ కావొచ్చని, మేం అతని కోసం వచ్చామని చెప్పారు. పాకిస్తాన్ కోసం కాదని, అఫ్రిది కోసం వచ్చానని చెప్పారు.

అనంతనాగ్ నుంచి వ్యాపారవేత్త రమీజ్ రియాజ్ తన సోదరుడితో కలిసి వచ్చాడు. అతను మాట్లాడుతూ.. మేం అఫ్రిదికి పెద్ద అభిమానులమని చెప్పాడు. కాగా, షోయబ్ మాలిక్‌తో ఓ అభిమాని ఫోటో దిగారు. హోలీ సందర్భంగా అభిమానులతో మాలిక్ ఆనందించారు.

మాట్లాడుకోకున్నా కప్పు కొట్టాం: మాలిక్

తమ జట్టు ఐక్యంగా ఉందని, ఎలాంటి వర్గ పోరు లేదని పాకిస్థాన్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ గురువారం చెప్పాడు. 2009లో తమ జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోకున్నా ప్రపంచ కప్‌ గెలిచామన్నాడు. జట్టు వర్గాలుగా విడిపోలేదన్నాడు. 2009లో మా జట్టులో ఆరుగురు ఆటగాళ్ల మధ్య మాటల్లేవని, అయినా మేం టైటిల్‌ గెలిచామన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+