Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌలర్లు విఫలం: భారత్ ఓటమి, పైనల్లోకి విండీస్

ముంబై: ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో బౌలర్లు విఫలం చెందడంతో భారత్ ఓటమి పాలైంది. స్పిన్నర్లు ఘోరంగా విఫలమయ్యారు. భారత్ తమ ముందు ఉంచిన 193 పరుగుల లక్ష్యాన్ని సిక్స్‌లు, ఫోర్లతో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఛేదించారు. చివరి ఓవరు విరాట్ కోహ్లీ వేశాడు. ఆరు బంతులకు ఎనిమిది పరుగులు చేయాల్సిన స్థితిలో కోహ్లీ ఓవర్ వేశాడు.

వెస్టిండీస్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. వెస్టిండీస్ మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లెండిల్స్ సిమ్మన్స్ 51 బంతుల్లో ఐదు సిక్స్‌లు, ఏడు ఫోర్లతో 83 పరుగులు చేసిన నాటౌట్‌గా మిగిలాడు. ఆండ్రీ రసెల్ 20 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు.

ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో తన తొలి ఓవరు తొలి బంతికి జస్‌ప్రీత్ సింగ్ బుమ్రా క్రిస్ గేల్ వికెట్ తేశాడు. దీంతో వెస్టీండీస్ ఆరు పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. గేల్ ఐదు పరుగులు చేశాడు.

World T20: West Indies invite India to bat first in Mumbai

హార్దిక్ పాండ్యా నో బాల్ వల్ల ఈసారి సిమ్మన్స్ బతికిపోయాడు. విస్టిండీస్ స్కోరు 132 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిమ్మన్స్ పాండ్యా వేసిన బంతిని గాలిలోకి లేపాడు. ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే, అది నో బాల్‌గా తేలింది. తర్వాతి బంతిని సిమ్మన్స్ సిక్సర్‌గా మలిచాడు.

రెగ్యులర్ బౌలర్లను చార్లెస్, సిమ్మన్స్ చితకబాదుతున్న సమయంలో అనూహ్యంగా కెప్టెన్ ధోనీ విరాట్ కోహ్లీని బౌలింగుకి దింపాడు. విరాట్ కోహ్లీ తన తొలి ఓవరు తొలి బంతికే వికెట్ తీశాడు. దీంతో వెస్టిండీస్ 116 పరుగులకు మూడు వికెట్లు కోల్ప్యోంది. జాన్సన్ చార్లెస్ 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ బౌలింగులో వెనుదిరిగాడు.

వెస్టిండీస్ 49 పరుగుల స్కోరు వద్ద ఉన్నప్పుడు సిమ్మన్స్ అశ్విన్ బౌలింగులో అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అశ్విన్ బౌలింగులో సిమ్మన్స్ కొట్టిన బంతిని గాలిలో బుమ్రా అద్భుతంగా క్యాచ్ పట్టాడు. కానీ అశ్విన్ వేసిన బంతి నో బాల్ తేలింది.

భారత్ తన ముందుంచిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 19 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. శామ్యూల్స్ 8 పరుగులు మాత్రమే చేసి నెహ్రా బౌలింగులో అవుటయ్యాడు.

World T20: West Indies invite India to bat first in Mumbai

ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ వెస్టిండీస్‌పై రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో ఓ సిక్స్, 11 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. కెప్టెన్ ధోనీ 9 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 15 పరుగులు చేశాడు. భారత్ 9.60 రన్ రేట్ సాధించింది.

ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్ - వెస్టిండీస్ మధ్య జరిగిన సెమీ ఫైనల్లో.. టాస్ గెలిచిన సామి సేన ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగుకు దిగింది. భారత్ జట్టులో యువరాజ్ స్థానంలో మనీష్ పాండే, ఓపెనర్ ధావన్ స్థానంలో రహానే వచ్చాడు.

భారత్ 128 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అజింక్యా రహనే 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రసెల్ బౌలింగులో అవుటయ్యాడు.

భారత్ 128 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అజింక్యా రహనే 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రసెల్ బౌలింగులో అవుటయ్యాడు.

World T20: West Indies invite India to bat first in Mumbai

ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ గురువారం 7.2 ఓవర్ల వద్ద 62 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ మూడు సిక్స్‌లు, మూడు ఫోర్ల సాయంతో బద్రీ బౌలింగులో 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

శిఖర్ ధావన్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన అజింక్యా రహనేతో కలిసి రోహిత్ శర్మ సిక్స్‌లు ఫోర్లతో అదరగొడుతూ ఔటయ్యాడు. రహనే కూడా దూకుడు ప్రదర్శిస్తూ ఔటయ్యాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+