For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ సిక్సరే మలుపు: సఫారీలు సఫా, సెమీకి విండీస్

By Pratap

నాగపూర్: ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచులో చివరి బంతి వరకు దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ను ఓడించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరి ఓవరులో రబడ బౌలింగులో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ బ్రాత్‌వైట్ కొట్టిన సిక్సర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చింది. దక్షిణాఫ్రికాపై విజయంతో వెస్టిండీస్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టింది.

బ్యాటుతో తడబడిన దక్షిణాఫ్రికా బంతితో పోరాటం చేసి వెస్టిండీస్‌ను ఓడించడానికి కష్టపడింది. కానీ ఫలితం దక్కలేదు. హ్యాట్రిక్ విజయాలతో వెస్టిండీస్ ముందుకు దూసుకుని వెళ్లింది. చివరి ఓవరు వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో కరేబియన్లు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించారు.

వెస్టిండీస్ బౌలర్లు విజృంభించి దక్షిణాఫ్రికాను 122 (8 వికెట్లకు) తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. అయితే శామ్యూల్స్‌ (43; 44 బంతుల్లో 6×4), చార్లెస్‌ (32; 35 బంతుల్లో 2×4, 1×6) రాణించడంతో విండీస్‌ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Chris gayle

దక్షిణాఫ్రికా బౌలర్లలో తొలి ఓవర్లోనే రబాడ (1/38).. గేల్‌ (4)ను బౌల్డ్‌ చేశాడు. ప్రమాదకరమైన ఫ్లెచర్‌ (11) కూడా పది ఓవర్లలోపే పెవిలియన్ దారి పట్టాడు. ఈ సమయంలో చార్లెస్‌, శామ్యూల్స్‌లు కీలక ఇన్నింగ్స్‌ ఆడి గెలుపు దిశగా నడిపించారు. శామ్యూల్స్‌తో కలిసి 32 పరుగులు జోడించిన చార్లెస్‌ వీస్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో భారమంతా శామ్యూల్స్ తనపై వేసుకున్నాడు.

15 ఓవర్లలో 91/4 స్కోరుతో ఉన్న వెస్టిండీస్ విజయాన్ని తేలిగ్గానే అందుకుంటుందని అనిపించింది. అయితే 17వ ఓవర్లో తాహిర్‌ (2/13) వరుస బంతుల్లో రసెల్‌ (4), సామి (0)లను ఔట్‌ చేసి విజయంపై ఆశలు రేకెత్తించాడు.

చివరి 2 ఓవర్లలో 20 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో కరేబియన్లు పడ్డారు. మోరిస్‌ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన శామ్యూల్స్‌ ఐదో బంతికి పెవిలియన్ చేరుకున్నాడు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగాస రబాడ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ కొట్టిన బ్రాత్‌వైట్‌ (10) విజయాన్ని ఖాయం చేశాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌ మూడో బంతికే ఆమ్లా (1) రన్నవుట్‌తో వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్‌ (9) రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే రొసో(0) వెనుదిరిగాడు.

మూడు ఓవర్లకు 20/3తో కష్టాల్లో ఉన్న జట్టును డివలియర్స్‌ (10) కూడా ఆదుకోలేకపోయాడు. డ్వేన్‌ బ్రావో అతడిని బౌల్డ్‌ చేశాడు. మిల్లర్‌ (1) గేల్‌ బౌలింగ్‌లో అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా 8.2 ఓవర్లలో 47/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆ కీలక సమయంలో డికాక్‌ (47; 46 బంతుల్లో 3×4, 1×6).. వీస్‌ (28)తో కలిసి దక్షిణాఫ్రికాను ఆదుకున్నాడు. ఆరో వికెట్‌కు వీరిద్దరు 7.2 ఓవర్లలో 50 పరుగులు జోడించారు. దీంతో 15 ఓవర్లకు దక్షిణాఫ్రికా 91/5తో మెరుగ్గానే కనిపించింది. ఆ తర్వాత డికాక్‌ వెనుదిరగడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దక్షిణాఫ్రికా వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుని తక్కువ స్కోరుకే పరిమితమైంది. గేల్‌ (2/17), బ్రావో (2/20), రసెల్‌ (2/28)లు దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+