చొక్కాలు విప్పిన విండిస్ ఆటగాళ్లు: గెలిచిన ప్రైజ్‌మనీ ఎంత?
కోల్‌కత్తా: ఓడితే... నిర్వేదంతో తలపట్టుకోవడం. గెలిస్తే... వినూత్న సంబరాలతో హోరెత్తించే వైనం వెస్టిండిస్ జట్టుది. కరేబియన్ జట్టుగా మనం పిలుచుకుంటున్న వెస్టిండిస్ జట్టు తన ప్రత్యర్ధి జట్టుపై విజయం సాధిస్తే సంబరాలు జరిపే స్టైల్ వెరైటీగా ఉంటుంది. టోర్నీలో భాగంగా మొన్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ సేనపై విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూం వెస్టిండిస్ ఆటగాళ్లు చిందేశారు.
నిన్న కోల్‌కత్తాలో ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ మ్యాచ్ గెలిచిన ఆనంతరం స్టేడియంలోనే సంబరాలు చేశారు. భారత్‌పై సెమీస్‌లో విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూంలో ఆ జట్టు సభ్యులు క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవోలు చొక్కాలు విప్పి వినూత్న డ్యాన్స్‌తో హోరెత్తించిన వీడియోని మనం చూశాం. తాజాగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలోనే చొక్కాలు విప్పిన విండీస్ క్రికెటర్లు తమ జాతీయ జెండాను చేతబట్టుకుని స్టేడియం చుట్టూ ఓ రౌండేశారు.
వెస్టిండిస్ జట్టు కెప్టెన్ డారెన్ సామీ, కీలక ఆటగాడు అండ్రూ రస్సెల్‌లు అర్ధనగ్నంగా జాతీయ జెండాను పట్టుకుని ముందు నడవగా, వారి వెంటే మిగిలిన జట్టు సభ్యులు నడిచారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీ20 వరల్డ్ కప్‌లో రెండోసారి వెస్టిండిస్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది.
టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా సెమీస్ వరకూ చేరినా... కరేబియన్ల చేతిలో ఓటమిపాలైంది. ఆదివారం రాత్రి కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తుది పోరులో విండీస్ జట్టు... ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించింది. ఆదివారం మధ్యాహ్నాం జరిగిన మహిళల ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసిన వెస్టిండిస్ జట్టు ఛాంపియన్‌గా అవతరించింది.
దీంతో ఐసీసీ వరల్డ్ టీ20 పోరు ముగిసింది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ విజేతకు, రన్నరప్ జట్టుకు ప్రైజ్‌మనీ ఎంత ఇచ్చారనేది ఒకసారి పరిశీలిద్దాం. వరల్డ్ కప్ పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన వెస్టిండిస్ జట్టుకు ఏకంగా రూ. 23 కోట్లు దక్కాయి. ఇక రన్నరప్ గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు రూ. 9.93 కోట్లు దక్కాయి.
సెమీస్‌లోనే ఇంటిదారి పట్టిన భారత జట్టుకు రూ.2.64 కోట్లు దక్కాయి. సెమీస్ లోనే పోరు ముగించిన న్యూజిల్యాండ్‌కు కూడా ఇంతే మొత్తం లభించింది. ఇక మహిళ విభాగానికొస్తే... విన్నర్‌గా నిలిచిన విండీస్ జట్టు రూ.66.23 లక్షలు, రన్నర్ స్థానంతో సరిపెట్టుకున్న ఆస్ట్రేలియా జట్టు రూ.33.11 లక్షలు దక్కించుకున్నాయి.

వినూత్నంగా సంబరాలు
చొక్కాలు విప్పిన వెస్టిండిస్ జట్టు ఆటగాళ్లు

వినూత్నంగా సంబరాలు
చొక్కాలు విప్పిన వెస్టిండిస్ జట్టు ఆటగాళ్లు

వినూత్నంగా సంబరాలు
చొక్కాలు విప్పిన వెస్టిండిస్ జట్టు ఆటగాళ్లు

వినూత్నంగా సంబరాలు
చొక్కాలు విప్పిన వెస్టిండిస్ జట్టు ఆటగాళ్లు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications