11సార్లు: పాక్ తలవంచి, ఈడెన్‌లో భారత్ రికార్డ్, సంబరం (వీడియో)
కోల్‌కతా: భారత్‌తో జరిగిన ప్రపంచ కప్ పోరులో పాకిస్తాన్ ఇప్పటిదాకా గెలవలేదు. శనివారం ట్వంటీ 20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ గెలిచి, చరిత్రను పునరావృతం చేసింది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు నిలకడగా ఆడటంతో పాకిస్థాన్ పైన ఘన విజయం సాధించింది.
దీంతో వన్డేలు, ట్వంటీ 20లు కలిపి మొత్తం 11 ప్రపంచ కప్ పోటీలలో.. 11వసారి భారత్ గెలిచింది. ఇప్పటి వరకు ఈడెన్ గార్డెన్స్‌లలో జరిగిన మ్యాచుల్లో పాకిస్తాన్‌దే పైచేయి. ఈ గెలుపు ద్వారా పాక్ పేరిట ఉన్న 'గెలుపు' రికార్డును భారత్ తుడిచివేసింది.
ప్రపంచకప్‌లలో పాకిస్తాన్ పైన వరుస గెలుపులు అనే తిరుగులేని రికార్డును పదిలపర్చుకుంటూనే, కోల్‌కతాలో పాక్‌కు ఉన్న గెలుపు రికార్డును తుడిచివేసింది. ట్వంటీ 20, వన్డే ప్రపంచకప్‌లలో భారత్ - పాక్‌లు 11సార్లు తలపడగా.. అన్నిసార్లూ మనమే గెలిచాం.
ఇందులో యాభై ఓవర్ల ప్రపంచకప్‌లో 6, ప్రపంచ కప్ ట్వంటీ 20లు 5 ఉన్నాయి. మొత్తం 11సార్లు కూడా భారతే గెలిచింది.
భారత్ గెలిచిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. మోడీతో పాటు మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు కాంగ్రాట్స్ చెప్పారు. ట్విట్టర్లో అభిమానులు కూడా స్పందిస్తున్నారు. జవాన్లు సంబరాలు చేసుకున్నారు.
పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించడంతో సంబురాలు అంబరాన్నంటాయి. బీఎస్‌ఎఫ్ జవాన్లు ఆనందంలో మునిగిపోయారు. డ్యాన్సులు చేశారు. భారత ఆటగాళ్లకు శుభాకాంక్షలు చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు జాతీయ జెండాలతో ఊరేగారు. ఈలలు, కేకలు వేస్తూ.. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
పాక్‌పై భారత్ గెలుపు
పాకిస్తాన్ పైన భారత్‌కు ప్రపంచకప్‌లలో ఉన్న చరిత్ర చెక్కు చెదరలేదు. అదే సమయంలో ఈడెన్లో పాక్‌కు ఉన్న చరిత్రను తుడిచిపెట్టాం.

పాక్‌పై భారత్ గెలుపు
పాకిస్తాన్ జట్టు పైన భారత జట్టుకు ఈడెన్ గెలుపు ఏకంగా 11వ విజయం. వన్డే ప్రపంచకప్పుల్లో ఇప్పటికే ఆరు విజయాలు సాధించిన భారత్, ట్వంటీ 20ల్లో జైత్రయాత్రను కొనసాగిస్తూ చిరకాల ప్రత్యర్థిపై ఐదో విజయాన్ని నమోదు చేసింది.

పాక్‌పై భారత్ గెలుపు
తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా కంగుతిని, తీవ్ర ఒత్తిడి మధ్య చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొన్న ధోనీ సేన అద్భుత ఆటతీరుతో విజయం సాధించింది.

పాక్‌పై భారత్ గెలుపు
శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ పైన అద్భుత విజయం సాధించింది. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 119 పరుగుల లక్ష్యాన్ని భారత్.. ఇంకో 13 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

పాక్‌పై భారత్ గెలుపు
విరాట్ కోహ్లి 37 బంతుల్లో 55 పరుగులు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువరాజ్ 23 బంతుల్లో 24 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

పాక్‌పై భారత్ గెలుపు
ట్వంటీ 20 ప్రపంచకప్ ఛేదనల్లో కోహ్లి స్థానం రెండు. ఏడు మ్యాచ్‌ల్లో 187.50 సగటుతో కోహ్లి 375 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ 10 మ్యాచ్‌ల్లో 47.37 సగటుతో 379 పరుగులు చేశాడు.

పాక్‌పై భారత్ గెలుపు
మేం సెకండాఫ్‌లో బంతి బాగా టర్న్ అవుతుందని భావించామని, అయితే వారి జట్టులో ఒకే స్పిన్నర్ ఉండడంతో మాకు కలవరం కలిగించలేదని, కాగా, మా బౌలర్లు మంచి ప్లేస్‌లో బంతులను విసిరి స్పిన్ రాబట్టారని ధోనీ చెప్పాడు.

పాక్‌పై భారత్ గెలుపు
మేం సరిగా ప్రణాళికలు అమలు చేశామని, ఎందుకంటే ఒకసారి నాకౌట్ మ్యాచ్‌లు ఆడడం ప్రారంభిస్తే రెండో అవకాశం ఉండదన్న సంగతి తెలుసునని, పిచ్‌పై బంతి ఈవిధంగా తిరుగుతుందని ముందే తెలిస్తే నేను మరో స్పిన్నర్‌ను తప్పనిసరిగా తీసుకునేవాడినని ధోనీ చెప్పాడు.

పాక్‌పై భారత్ గెలుపు
ఇది చాలా సవాల్‌తో కూడుకున్న వికెట్ అని, ప్రతి క్రికెటర్ ఇలాంటి పిచ్‌పై రాణించాలని కోరుకుంటాడని, మంచి బౌలింగ్ వనరులున్న మంచి జట్టుపై ఇలాంటి పిచ్‌పై ఆడితే ఆ మజానే వేరు అని కోహ్లీ మ్యాచ్ అనంతరం అన్నాడు.

పాక్‌పై భారత్ గెలుపు
ఢాకాలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన 49 పరుగులు కూడా తనకు చాలా సంతృప్తిని కలిగించిందని, ఈ మ్యాచ్‌లో అర్థసెంచరీతో విజయం సాధించడం ప్రత్యేక అనుభూతి అని, అయితే గత మ్యాచ్‌లో నేను ఔట్ కావడం నన్ను చాలా బాధించిందని కోహ్లీ చెప్పాడు.

పాక్‌పై భారత్ గెలుపు
ఈ మ్యాచ్‌లో మరో ఎండ్‌లో యువరాజ్ అద్భుతంగా ఆడాడని కోహ్లీ కితాబిచ్చాడు. 61 పరుగుల తమ ఇద్దరి భాగస్వామ్యం జట్టును విజయతీరాలకు చేర్చిందని, సచిన్ ఆటను చూస్తూ పెరిగానని, ఈ రోజు 67, 000 మంది ఫాన్స్‌తో సహా సచిన్ ఆటను వీక్షిస్తుండగా రాణించడం చాలా సంతోషం కలిగించిందన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications