Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టార్గెట్ అనుష్క: సిగ్గు సిగ్గు.. కోహ్లీకి కోపమొచ్చింది

మొహాలీ: భారత స్టార్ క్రికెటర్, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది. ఆయన సోషల్ మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాలీవుడ్ నటి, తన ప్రియురాలు అనుష్క శర్మను సోషల్ మీడియాలో పదేపదే టార్గెట్ చేసుకోవడంపై కోహ్లీ మండిపడ్డాడు.

కోహ్లీ ఇటీవల అనుష్క శర్మకు దూరమైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. అనుష్క ప్రేమలో ఉన్నప్పుడు కోహ్లీ బాగా ఆడలేదని, ఇప్పుడు బాగా ఆడుతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా స్పందిస్తున్నారు.

 World T20: Virat Kohli slams Twitterati who trolled Anushka Sharma for his bad form

అనుష్క శర్మ లేకపోవడం వల్లే కోహ్లీ బాగా ఆడుతున్నాడని సెటైర్లు వేస్తున్నారు.దీనిపై కోహ్లీ ఈ రోజు ఘాటుగా స్పందించాడు. 'అదే పనిగా అనుష్క శర్మను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటు. కొంతైనా దయ ఉండాలి. ఆమె తనకు ఎప్పుడు పాజిటివ్' అని ట్వీట్ చేశాడు. అంతేకాదు, అనుష్కను టార్గెట్ చేసుకుంటున్నందువల్ల.. 'షేమ్) అంటూ ఓ ఇమేజ్ పోస్ట్ చేశాడు.

అనుష్క పట్ల సోషల్ మీడియాలో ఇష్టారీతిగా మాట్లాడే వారుకు కొంచమైనా దయ, జాలి ఉండాలని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇలా ఇష్టం వచ్చినట్లు అంటే వారి కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతారో ఆలోచించాలని సూచించాడు. అనుష్క శర్మను పదేపదే టార్గెట్ చేసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+