సచిన్ కంటే బెస్ట్: కోహ్లీపై గంగూలీ, లారా కంటే ఉత్తమం: చాపెల్
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో అతని పైన ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సౌరవ్ గంగూలీ, ఇయాన్ చాపెల్‌లు కోహ్లీని ఆకాశానికెత్తారు.
గంగూలీ మాట్లాడుతూ.. చేజింగులో సచిన్ టెండుల్కర్ కంటే కోహ్లీ గొప్పగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. రోజురోజుకూ కోహ్లీ మరింతగా రాణిస్తున్నాడన్నాడు. కోహ్లీని అవుట్ చేయడంపై ఆస్ట్రేలియా వల్ల కాలేదన్నాడు. కోహ్లీ ఆడిన తీరు భారత్ సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిందని చెప్పాడు.

కోహ్లీ షాట్ ప్లేస్‌మెంట్ బ్రయాన్ లారా కంటే బాగున్నాయని ఇయాన్ చాపెల్ అన్నాడు. కోహ్లీని చూసిన తర్వాత షాట్ ఎంపికలో బ్రయాన్ లారా తనకు రెండో స్థానంలో కనిపిస్తున్నాడని చెప్పాడు. కోహ్లీ మొదటి స్థానంలో ఉంటాడని చెప్పాడు.
ఇలాంటి అత్యుత్తమ ట్వంటీ 20 మ్యాచ్ తాను చూడలేదని చెప్పాడు. అతను బెస్ట్ ఫినిషర్ అన్నాడు. అతను అద్భుతంగా ఆడాడని, అతని ఆట తీరు అబ్బురపరిచిందని చెప్పాడు.
అజహరుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్‌లు మణికట్టుతో మాయ చేస్తారని చెప్పాడు. జహీర్ అబ్బాస్ రబ్బర్ మణికట్టును కలిగి ఉంటాడని, కోహ్లీ కూడా తన మణికట్టు పవర్ చూపించాడన్నాడు. అతను మణికట్టతో బలంగా బాదుతున్నాడని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications