స్వయం తప్పిదాలే: భారత్‌కు విజయాన్ని దూరం చేసిన ఆ 3 అడుగులు
ముంబై: కోట్లాదిమంది ప్రజల కలల్ని కల్లలు చేస్తూ.. టీ-20 ప్రపంచకప్ సెమీస్‌లోనే టీమిండియా తన పోరాటాన్ని ముగించింది. పాకిస్థాన్‌ను పాత రేసి.. బంగ్లాను అడ్డుకొని.. ఆస్ట్రేలియా సవాల్ ఛేదించుకొని సెమీస్ వచ్చిన టీమిండియా కరీబియన్లకు తలొంచింది.
స్వయం తప్పిదాలతో చేజేతులా మ్యాచ్‌ను కోల్పోయింది. వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్ భారత్ బౌలర్లపై విరుచుకుపడుతున్న వేళ భారత బౌలర్ల నోబాల్స్ మ్యాచ్‌ను వెస్టిండిస్ వైపుకు తిప్పేశాయి. సిమ్మన్స్‌కు ఆరంభంలోనే అశ్విన్ వేసిన నోబాల్ అతడిని ప్రాణం పోయగా, యువ ఆల్‌రౌండర్ పాండ్యా మరో నోబాల్‌తో అతణ్ణి హీరోని చేశాడు.
వివరాల్లోకి వెళితే.... రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఏడవ ఓవర్లో చార్ల్స్‌కు ఇచ్చిన జీవదానం, హార్డిక్ పాండ్య 14వ ఓవర్లో లెండిల్ సిమ్మన్స్‌కు వేసిన నోబాల్స్ వెస్టిండీస్‌ను విజయం దిశగా నడిపించాయి. చార్ల్స్ భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడుతున్న దశలో అశ్విన్ సంధించిన బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించాడు.
దీనిని అద్భుతంగా అందుకున్న బుమ్రా, చార్ల్స్ అవుట్ అని భావించాడు. అయితే థర్డ్ అంపైర్ దానిని నోబాల్‌గా గుర్తించి నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో చార్ల్స్ బతికిపోయాడు. ఆ తర్వాత 14వ ఓవర్లో హార్డిక్ పాండ్య వేసిన బంతిని లెండిల్ సిమ్మన్స్ భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు.
దీనిని అశ్విన్ ఒడిసి పట్టాడు. అంతా అవుట్ అని భావించారు. థర్డ్ అంపైర్ నోబాల్‌గా దీనిని ప్రకటించడంతో అది నాటౌట్ అయింది. చివరిగా 18వ ఓవర్లో బుమ్రా వేసిన బంతిని జడేజా బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా పట్టుకున్నాడు. కానీ, చివర్లో కాలు బౌండరీ లైన్ ను తాకడంతో అది సిక్సర్ గా మారింది.

7వ ఓవర్లో అశ్విన్:
7వ ఓవర్లో అశ్విన్ చేశాడు. అప్పటికి 18 పరుగులే చేశాడు సిమన్స్. విండీస్ స్కోరు 49 పరుగులే. అశ్విన్ బంతిని కట్ చేయబోతే షార్ట్ థర్డ్‌మ్యాన్‌లో బుమ్రా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. భారత జట్టంతా సంబరంలో మునిగిపోయింది. సిమన్స్ పెవిలియన్ వైపు కదిలాడు. కానీ అంపైర్ అతణ్ని ఆపాడు. బంతి నోబాల్ అని తేలింది. జీవనదానం లభించిన ఉత్సాహంలో ఆ తర్వాత రెచ్చిపోయాడు సిమన్స్. మెరుపు వేగంతో అర్ధశతకం పూర్తి చేశాడు.

15వ ఓవర్‌లో పాండ్య:
రండో తప్పు 15 ఓవర్లో జరిగింది. ఈసారి బాధ్యుడు పాండ్య. అప్పటికి 50 పరుగులతో ఉన్నాడు సిమన్స్. ఈసారి ఫుల్‌టాస్ బంతిని బాదబోయి కవర్స్‌లో అశ్విన్ చేతికి చిక్కాడు. భారత జట్టులో మళ్లీ సంబరాలు. సిమన్స్ పెవిలియన్ బాట పట్టాడు. కానీ అంపైర్ మళ్లీ అతణ్ని ఆపాడు. రీప్లేలో అది కూడా నోబాల్ అని తేలింది. తర్వాతి బంతికి ఫ్రీహిట్‌ను కూడా సద్వినియోగం చేస్తూ సిక్సర్ బాదాడు సిమన్స్.

జడేజా రూపంలో:
మూడో తప్పు వేసింది జడేజా. బుమ్రా బౌలింగ్‌లో సిమన్స్ మిడ్‌వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. బంతి బౌండరీ అవతల పడబోతుంటే.. జడేజా అద్భుతంగా అందుకున్నాడు. బౌండరీ లైన్‌ను తాకకుండా తమాయించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. బంతిని అందుకున్న వెంటనే ఇటు వైపు విసిరేశాడు. కోహ్లి దాన్ని ఒడిసిపట్టుకున్నాడు. కానీ జడేజా కాలు కొద్దిలో బౌండరీ హద్దుకు తాకిందని రీప్లేలో తేలింది. సిమన్స్ మళ్లీ బతికాడు. 15 బంతుల్లో 32 పరుగులతో కష్టంగా ఉన్న సమీకరణం ఆ సిక్సర్‌తో తేలికైపోయింది.

ఓటిమికి కారణాలు: భారత్ విజయాన్ని దూరం చేసిన ఆ మూడు అడుగులు
కోట్లాదిమంది ప్రజల కలల్ని కల్లలు చేస్తూ.. టీ-20 ప్రపంచకప్ సెమీస్‌లోనే టీమిండియా తన పోరాటాన్ని ముగించింది. పాకిస్థాన్‌ను పాత రేసి.. బంగ్లాను అడ్డుకొని.. ఆస్ట్రేలియా సవాల్ ఛేదించుకొని సెమీస్ వచ్చిన టీమిండియా కరీబియన్లకు తలొంచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications