ముంబై: ప్రపంచ టీ20 టోర్నీలో టీమిండియా ఫేవరేట్‌గా అడుగుపెట్టిందని, ఆ జట్టులో మ్యాచ్ విన్నర్లు కూడా ఉన్నారని.. అయినా సెమీ ఫైనల్లో ఆ జట్టుకు షాకిస్తామంటున్నాడు వెస్టిండీ విధ్వంసక బ్యాట్స్ మన్ క్రిస్‌గేల్. మార్చి 31న టీమిండియాతో సెమీస్‌లో తలపడనున్న నేపథ్యంలో విండీస్ జట్టు ఇక్కడి బ్రబోర్న్ స్టేడియం ప్రాక్టీస్ చేసింది.
ఈ సందర్భంగా గేల్ మీడియాతో మాట్లాడుతూ.. తాము విరాట్ కోహ్లీ ఒక్కడిపైనే దృష్టి పెట్టమని, మొత్తం ఆటగాళ్లపై దృష్టి సారిస్తామని తెలిపాడు. మూడు విజయాలతో టీమిండియా కొంత ఉత్సాహంగా ఉందని, ఎంతో ఆత్మ విశ్వాసంతో సెమీస్ లో అడుగుపెట్టిందని తెలిపాడు.
టీమిండియాలో చాలా మంది ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నారని, అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న జట్టును ఎదుర్కొవడం కొంత కష్టమేనని తెలిపాడు. అయితే, తమ జట్టు టీమిండియాను అసంతృప్తికి గురిచేసేందుకు సిద్ధంగా ఉందని విండీస్ స్టార్ బ్యాట్‌మన్ తెలిపాడు.

పాకిస్థాన్, ఆస్ట్రేలియాలతో జరిగిన మ్యాచులను విరాట్ కోహ్లీ ఒంటిచేత్తో గెలిపించాడని కొనియాడాడు. అతనితోపాటు ఇతర ఆటగాళ్లు కూడా రాణించే అవకాశం లేకపోలేదని తెలిపాడు.
ప్రపంచంలో ఉత్తమ క్రికెట్ ఆటగాడు కోహ్లీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదని, ఈ ఏడాది అతని ప్రదర్శన అద్భుతంగా ఉందని గేల్ పేర్కొన్నాడు. వాంఖడే స్టేడియంలో కూడా అతడు రాణించే అవకాశం ఉందని తెలిపాడు. తమ జట్టు శక్తి మేరకు విజయం కోసం పోరాడతామని తెలిపాడు.
టీమిండియాలోలాగే తమ జట్టులోనూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారని గేల్ చెప్పాడు. తన గురించి చెప్పడం లేదని అన్నాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ చెలరేగిపోవద్దని కోరుకుంటున్నట్లు గేల్ స్పష్టం చేశాడు. ఒక వేళ కోహ్లీ చెలరేగినా తామే గెలవాలని కోరుకుంటున్నలు తెలిపాడు. ఏదైమైనా తమ జట్టు విజయాన్నే కోరుకుంటామని చెప్పాడు.