సెమీస్‌లో గెలుపెవరిది?: ఆన్సర్ చెప్పని సచిన్
ముంబై: ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో భాగంగా ఈరోజు ముంబైలోని వాంఖడె స్టేడియంలో భారత్-వెస్టిండిస్ మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎంతో ఉత్సుకతతో ఉన్నాడు. జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో సచిన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఎందుకంటే టీ20లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహంచడం కష్టం కాబట్టి. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌ని 'ఓపెన్ గేమ్' అని వ్యాఖ్యానించాడు. 'క్రికెట్ ను ఆస్వాదించండి. ఆటపైనే దృష్టిపెట్టండి. ఫలితం వస్తుంది. మేమంతా మీ వెనుకే ఉన్నాం' అని టీమిండియాకు సచిన్ శుభాకాంక్షలు తెలిపాడు.
'నా మనసు ఎప్పుడూ భారతేవైపే ఉంటుంది. వేరొకటి ఉండదు. అయితే ఈ రోజు జరిగే సెమీస్ ఓపెన్ గేమ్. హోరాహోరీ పోరాటం ఉండవచ్చు. ఎందుకంటే వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం అత్యుత్తమ క్రికెట్ ఆడుతోంది. జట్టులో కొందరు మేటి ఆటగాళ్లున్నారు.' అని సచిన్ అన్నాడు.
'టీమిండియా కూడా అద్భుతంగా అడుతున్నారు. ముఖ్యంగా మొహాలీలో ఆస్ట్రేలియాతో, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఒత్తిడిలో ఉన్నా ఎంతో చక్కగా రాణించింది. భారత్ ఇదే జోరు కొనసాగిస్తుందని ఆశిస్తున్నా' అని సచిన్ పేర్కొన్నాడు.
మరికొన్ని గంటల్లో ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఆరంభం కానున్న భారత్-వెస్టిండిస్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య 2-2తో రికార్డు సమంగా ఉంది. టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉంది.
ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు కఠోరసాధన చేస్తున్నారు. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పర్యవేక్షణలో టీమిండియా ప్రాక్టీస్ వివరాలు మీకోసం...

ధోనిసేన
ముంబై వాంఖడెలో ధోనిసేన కసరత్తులు

ధోనిసేన
ముంబై వాంఖడెలో ధోనిసేన కసరత్తులు

ధోనిసేన
ముంబై వాంఖడెలో ధోనిసేన కసరత్తులు

ధోనిసేన
ముంబై వాంఖడెలో ధోనిసేన కసరత్తులు

ధోనిసేన
ముంబై వాంఖడెలో ధోనిసేన కసరత్తులు

ధోనిసేన
ముంబై వాంఖడెలో ధోనిసేన కసరత్తులు

ధోనిసేన
ముంబై వాంఖడెలో ధోనిసేన కసరత్తులు

ధోనిసేన
ముంబై వాంఖడెలో ధోనిసేన కసరత్తులు

ధోనిసేన
ముంబై వాంఖడెలో ధోనిసేన కసరత్తులు

ధోనిసేన
ముంబై వాంఖడెలో ధోనిసేన కసరత్తులు

ధోనిసేన
ముంబై వాంఖడెలో ధోనిసేన కసరత్తులు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications