For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘ధర్మశాలలో పాక్‌ జట్టును ఆడించడం పెద్ద రిస్కే’

కరాచీ: ప్రపంచ టీ20 టోర్నీలో భాగంగా భారత్‌తో మార్చి 19న ధర్మశాలలో జరిగే మ్యాచులో ఆడించొద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ)కి సూచించాడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) చీఫ్ ఇషాన్ మని. డాన్ న్యూస్ ఛానల్‌తో ఇషాన్ మాట్లాడుతూ.. ధర్మశాలలో పాకిస్థాన్ జట్టు ఆడేందుకు భద్రత కల్పించలేమని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశాడు.

ఈ నేపథ్యంలో ధర్మశాలలో మ్యాచ్ కోసం పాక్ జట్టును పంపడం సరికాదని తెలిపారు. 'ఇప్పుడు వస్తున్న బెదిరింపులను పాకిస్థాన్ సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మన ఆటగాళ్లు, అధికారులు, ప్రజలు, మీడియా రక్షణకు సంబంధించిన విషయం' అని
ఇషాన్ చెప్పాడు.

World T20: Pakistan advised not to play against India in Dharamsala

పాకిస్థాన్ జట్టు స్థానంలో ఆస్ట్రేలియా ఉండి ఉంటే ధర్మశాల మ్యాచు నుంచి విరమించుకొని ఉండేదని చెప్పాడు. భారత్-పాక్ క్రికెట్ మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో.. భారత్‌లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని అన్నాడు. ధర్మశాలలో పాక్ ఆడటమంటే రిస్క్ చేయడమేనని తెలిపాడు.

కాగా, పాకిస్థాన్ ఆటగాళ్లకు, అధికారుల బృందానికి కావాల్సిన రక్షణ చర్యలు తీసుకుంటామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ భరోసా ఇచ్చారు. అయితే పాక్ జట్టుకు తాము భద్రత కల్పించలేమని మంగళవారం హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+