సెమీస్‌లో కివీస్, తొలి వికెట్ తర్వాత పాకిస్తాన్ 'ఔట్'!
మొహాలీ: కీలకమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి చవి చూసింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో అఫ్రిది సేన బొక్కబొర్లా పడింది. తద్వారా పాక్ ప్రపంచ కప్ ట్వంటీ 20 మెగా టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించే పరిస్థితి ఉంది. కివీస్ సెమీస్ చేరినట్లే.
మొహాలీ కేంద్రంగా జరిగిన మ్యాచ్‌లో అప్రిది సేన న్యూజిల్యాండ్ జట్టు చేతిలో చిత్తుగా ఓడింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
ఆ తర్వాత 181 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ జట్టు... నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు చేజార్చుకుని కేవలం 158 పరుగులు మాత్రమే చేయగలిగింది.

పాక్-కివీస్ మ్యాచ్
ఓ దశలో పాకిస్తాన్ కేవలం అయిదు ఓవర్లలోనే 61 పరుగులు చేసి వికెట్ కూడా కోల్పోలేదు. పాక్ దూకుడు చూస్తే పదిహేను పదహారు ఓవర్లలో మ్యాచ్ పూర్తి చేసే అవకాశాలు కనిపించాయి. కానీ మొదటి వికెట్ తర్వాత దాని దూకుడు తగ్గింది.

పాక్-కివీస్ మ్యాచ్
పాకిస్తాన్ ఓపెనర్లు షర్జిల్ ఖాన్(47), అహ్మద్ షెహజాద్ (30) శుభారంభాన్ని ఇచ్చినా దానిని మిగతా బ్యాట్స్ మెన్ కొనసాగించలేకపోయారు.

పాక్-కివీస్ మ్యాచ్
మెరుపులు మెరిపిస్తాడునుకున్న కెప్టెన్ షాహిద్ అఫ్రీది (9 బంతుల్లో 19 పరుగులు) తక్కువ సమయంలోనే వెనుదిరిగాడు. షర్జిల్ ఖాన్ అవుడవడమే పాక్ కొంపముంచిందని చెప్పవచ్చు.

పాక్-కివీస్ మ్యాచ్
పాకిస్తాన్ జట్టు కివీస్ జట్టు చేతిలో 22 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఆ జట్టు ఇక మెగా టోర్నీ నుంచి దాదాపుగా తప్పుకునే ప్రమాదంలో పడింది.

పాక్-కివీస్ మ్యాచ్
లీగ్ మ్యాచ్ ల్లో భాగంగా పాక్ జట్టు ఈ నెల 26న మొహాలీలోనే ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధిస్తే తప్పించి పాక్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండవు.

పాక్-కివీస్ మ్యాచ్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు మార్టిన్ గప్తిల్.. విలియమ్సన్ (17)తో కలిసి మెరుపు ఆరంభాన్నిచ్చాడు.

పాక్-కివీస్ మ్యాచ్
రెండో ఓవర్ నుంచి గప్తిల్ చెలరేగిపోయాడు. 33 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన గప్తిల్.. విలియమ్సన్‌తో తొలి వికెట్‌కు 7.2 ఓవర్లలోనే 62 పరుగులు జోడించాడు.

పాక్-కివీస్ మ్యాచ్
సెంచరీ దిశగా సాగుతున్న గప్తిల్‌ను సమి ఔట చేసినా.. రాస్ టేలర్ (23 బంతుల్లో 36 పరుగులు నాటౌట్) కివీస్‌కు భారీ స్కోరు అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications