శ్రీలంకకు పెద్ద దెబ్బ: ప్రపంచ కప్ నుంచి మలింగ ఔట్
బెంగళూరు: శ్రీలంక జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ టీ20 టోర్నమెంటు నుంచి శ్రీలంక జట్టు కీలక బౌలర్ లసిత్ మలింగ.. మోకాలి గాయం కారణంగా వైదొలగాడు.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన శ్రీలంక గురువారం ఆఫ్ఘానిస్థాన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచులో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో కూడా మలింగ ఆడలేదు.

గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన మలింగ.. స్వదేశానికి పయనమవుతున్నట్లు శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ) శుక్రవారం ప్రకటించింది. టోర్నీలో పాల్గొనేందుకు భారతదేశానికి వచ్చినప్పటి నుంచి మలింగ గాయంతో బాధపడుతున్నాడని తెలిపింది.
గాయం తగ్గకపోవడంతో అతడ్ని తిరిగి కొలంబో పంపించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అతని స్థానంలో తగిన బౌలర్‌ను జట్టులోకి తీసుకుంటామని తెలిపింది.
Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: World T20: Lasith Malinga ruled out
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications