Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 స్పెషల్: 25ఏళ్ల తర్వాత ఈడెన్‌లో బంగ్లా

కోల్‌కత్తా: ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం (మార్చి 16) నాడు బంగ్లాదేశ్, పాకిస్ధాన్ జట్లు తలపడుతున్నాయి. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది.

పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉన్న ఈస్ట్ బెంగాల్‌గా బంగ్లాదేశ్ 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ స్టేడియంలో ఆడుతుంది. వీరికి ప్రత్యర్ధులుగా వెస్ట్ పాకిస్థాన్ ఉండటం విశేషమే. ఆసియా కప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టు డిసెంబర్ 25, 1990న ఆడింది.

50 ఓవర్ల మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫరూక్ అహ్మద్ 57 పరుగులు చేయగా, ప్రస్తుతం టెలివిజన్ కామెంటేటర్‌గా ఉన్న అక్తర్ అలీ ఖాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో భారత్ తరుపున కపిల్ దేవ్, వి రాజు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

World T20: 'Grown up' Bangladesh to play at Eden after 25 years

టీమిండియా ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు 109 బంతుల్లో 104 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ తరుపున వికెట్‌ను తీసుకున్న ఏకైక బౌలర్ అక్తర్ అలీ ఖాన్ కావడం విశేషం. టీమిండియా ఈ మ్యాచ్‌లో ఒకే ఒక వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య పలు మ్యాచ్‌లు జరిగాయి.

అయితే కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆడే అవకాశం రాలేదు. 1998లో భారత్, బంగ్లాదేశ్, కెన్యాల మధ్య సిరిస్ జరిగినప్పటికీ బంగ్లాదేశ్ పైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ సిరిస్‌లో కెన్యాపై భారత్ విజయం సాధించింది. 1990లో ఉన్న బంగ్లాదేశ్ జట్టుతో పోలిస్తే ప్రస్తుతం జట్టు అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తోంది.

ఇటీవల ఆస్టేలియాలో జరిగిన 50 ఓవర్ల వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు సైతం అర్హత సాధించింది. ప్రస్తుతం ప్రపంచంలో టెస్టు క్రికెట్ ఆడుతున్న జట్లలో బంగ్లాదేశ్ ఒకటి. ప్రస్తుత బంగ్లాదేశ్ జట్టులో ఉన్న షాకిబ్ ఉల్ హాసన్ మాత్రమే కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్డేడియంలో ఆడిన అనుభవం ఉన్న ఆటగాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో భాగంగా కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు తరుపున షాకిబ్ ఉల్ హాసన్ ఆడాడు. పాకిస్థాన్‌తో బుధవారం జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా స్టేడియంలో ఆడిన అనుభవం ఉన్న అక్తర్ అలీ ఖాన్ కామెంటేటర్‌గా వ్యవహారించనున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత అభిమానులు బంగ్లాదేశ్‌కే మద్దతు పలికే అవకాశం ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+