ధోనీ, భజ్జీలకు డ్వేన్ బ్రావో 'ఛాంపియన్ డ్యాన్స్' సవాల్
న్యూఢిల్లీ: వెస్టిండిస్ - భారత్ జట్లు సెమీ ఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నాయి. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఇరు జట్లు గురువారం నాడు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ స్టార్ డ్వేన్ బ్రావో భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సవాల్ విసిరాడు.
ప్రపంచ కప్ మ్యాచులలో భాగంగా ఇటీవల పసికూన అఫ్గనిస్తాన్ చేతిలో వెస్టిండీస్ పరాజయం పాలైంది. ఆ సమయంలో ఆఫ్గన్ ఆటగాళ్లు చిందేశారు. ఇప్పుడు వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో.. ధోనీ, హర్భజన్ సింగ్‌లకు ఛాంపియన్ డ్యాన్స్ పైన సవాల్ చేశాడు.

సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా బ్రావో సవాల్ చేశాడు. హర్భజన్, ధోనీకి ఛాంపియన్ డ్యాన్స్ పైన సవాల్ చేస్తున్నానని పేర్కొన్నాడు. అంతేకాదు, బ్రావో.. ధోనీ కూతురు జీవా, భజ్జీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసాడు. ధోనీని కెప్టెన్ కూల్ అని, భజ్జీ చాంపియన్ డ్యాన్స్ అంటూ మరో ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications