మొహాలీ: భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మరోసారి కోపం వచ్చింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అనంతరం ఓ విలేకరి ప్రశ్నకు ధోనీకి చిర్రెత్తుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఎలాంటి కారణం లేకుండానే ధోనీకి కోపం వచ్చిందట.
ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. అయితే, మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు ట్రెయినింగ్ సెషన్లో పాల్గొన్నారు. ఫుట్‌బాల్ ఆడారు. ధోనీ నెట్‌కు వెళ్లే సమయంలో ఓ ఫోటోజర్నలిస్టు.. అతని ఫోటో కోసం ప్రయత్నించాడు.

ఈ సందర్భంగా ధోనీ ఆ ఫోటో జర్నలిస్ట్‌ను ఉద్దేశించి.. మమ్మల్ని కొంచం క్రికెట్ ఆడనిస్తావా అని అన్నాడు.
ధోనీ ఏమన్నాడో అర్థం చేసుకోలేకపోయిన సదరు ఫోటో జర్నలిస్ట్.. 'మీరు నన్ను క్రికెట్ ఆడమంటున్నారా?' అని అడిగాడు. దీనిపై ధోనీ స్పందించాడు. నీకు అంత సామర్థ్యమే ఉంటే ఇక్కడ ఉండేవాడివి (జట్టులో) అని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఈ వారంలో ధోనీకి ఆగ్రహం రావడం ఇది రెండోసారి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా, ఇప్పుడు ఆసిస్‌తో మ్యాచ్‌కు ముందు జర్నలిస్టుపై ధోనీ అసహనం వ్యక్తం చేశాడు.