ముంబై: వెస్టిండీ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. టీ ప్రపంచ కప్ టీ20 టోర్నీలో భాగంగా బుధవారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచులో క్రిస్ గేల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. బౌలర్ ఎవరైనా పరుగుల మోత మోగించాడని చెప్పాడు.
11 సిక్సుల సాయంతో వంద పరుగులు చేసిన గేల్.. ఒంటిచేత్తో తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడని కొనియాడాడు. అద్భుతమైన ఆటను ప్రదర్శించాడని అన్నాడు. తనలోని నైపుణ్యాన్ని మరోసారి ఆవిష్కరించాడని తెలిపాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రతీ బంతిని బౌండరీకి తరలించాడని చెప్పాడు.
'మా బౌలింగ్ అద్భుతంగా ఉందని నేను చెప్పలేను. మొదట మేం బౌలింగ్ బాగానే వేశాం. అయితే, అతడు బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు రాబట్టాడు' అని చెప్పాడు.

గేల్ ను కట్టడి చేసేందుకు చాలా ప్రణాళికలు వేశామని చెప్పాడు. అయితే అవేవీ పని చేయలేదని మోర్గాన్ తెలిపాడు. గేల్ లాంటి ఆటగాడికి బౌలింగ్ చేయడం చాలా కష్టమని తెలిపాడు. డాట్ బాల్స్ పడినప్పటికీ బౌండరీలే ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు. బుధవారం మ్యాచులో గేల్ తన విశ్వరూపం చూపాడని అన్నాడు.
తాము వేసిన ప్రణాళికలు ఏవీ అతనిపై పని చేయలేదన్న మోర్గాన్.. ఈ ప్రపంచ స్థాయి ఆటగాడి ప్రదర్శన అధ్బుతమని, అతని ప్రదర్శన తారాస్థాయికి చేరిందని చెప్పాడు. అందరూ గేల్ బాగా ఆడతాడని, విధ్వంసం సృష్టిస్తాడని ముందే ఊహిస్తారని తెలిపాడు. గేల్ కూడా వారి అంచనాలకు తగినట్లుగానే చెలరేగి ఆడాడని అన్నాడు. తనదైన రోజున గేల్ రెచ్చిపోయాడని తెలిపాడు.