Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బస్సులో హోలీ ఆడిన ధోనీ సేన: ప్రేమతో భజ్జీకి కోహ్లీ

హైదరాబాద్: బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో బంగ్లాదేశ్‌పై జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా గురువారం హోలీ సంబరాల్లో మునిగిపోయింది. ధోనీ జట్టు రంగులతో ఆనందాన్ని పంచుకున్నారు. బంగ్లాపై విజయం, హోలీ పండుగ రెండూ అవడంతో జట్టు సభ్యుల్లో ఆనందంలో మునిగిపోయారు.

World T20: After Last-Ball Win Versus Bangladesh, Team India Celebrate Holi

'అందరికీ హోలీ శుభాకాంక్షలు' అంటూ విరాట్‌ కోహ్లీ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశాడు. రోహిత్‌ శర్మ, హర్భజన్‌ సింగ్‌తో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న ఫొటోని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అంతేకాదు... జట్టు సభ్యులంతా బస్సులో హోలీ పండుగ ఎలా జరుపుకున్నారో వీడియో ద్వారా కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు.

జట్టు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు క్రికెటర్లు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. కోహ్లీ తోటి సభ్యులపై రంగులు వెదజల్లుతూ ఎంజాయ్ చేశాడు. సహచర ఆటగాళ్లకు హోలీ తిలకం దిద్దాడు. బస్సులో కోహ్లీతో పాటు యువరాజ్, హర్భజన్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, ధోనీ ఉన్నారు.

World T20: After Last-Ball Win Versus Bangladesh, Team India Celebrate Holi

మరోవైపు టీమిండియా మహిళా జట్టు సభ్యులు కూడా హోలీ సంబరాలను జరుపుకున్నారు. మిథాలీ సేన హోలీ పండుగను బాగా ఎంజాయ్ చేశారు. మహిళల జట్టు సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొని హంగామా చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+