107వ బర్త్‌డే: ఎక్కువ వయసు కలిగిన టెస్టు క్రికెటర్‌గా యాష్

హైదరాబాద్: ఇలీన్ యాష్ మంగళవారం 107వ పుట్టినరోజుని జరుపుకుంటోంది. అయితే, ఏంటంటా చాలా మంది ప్రపంచంలో 107 సంవత్సరాలు బ్రతికిన వాళ్లు ఉన్నారు కదా? అయితే, ఆమె ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా. ఇలీన్ యాష్ ప్రపంచంలో జీవించి ఉన్న ఎక్కువ వయసు కలిగిన టెస్టు క్రికెటర్ కావడం ఇక్కడ విశేషం.
జూన్, 1937న ఇంగ్లాండ్ జట్టు తరుపున అరంగేట్రం చేసిన ఇలీన్ యాష్ మంగళవారంతో 107 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఐసీసీ ప్రత్యేకంగా తన ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇలీన్ యాష్ ఆస్ట్రేలియాపై తన తొలి మ్యాచ్ ఆడారు.
ఇంగ్లాండ్ తరుపున ఇలీన్ యాష్ మొత్తం ఏడు మ్యాచ్‌లాడి 23 యావరేజితో 10 వికెట్లు తీశారు. ఇదిలా ఉంటే ఇలీన్ యాష్ పుట్టినరోజు సందర్భంగా ఇంగ్లాండ్ ప్రస్తుత కెప్టెన్ హీథర్ నైట్ స్వయంగా ఆమెను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications