WORLD RECORD- 43 బంతుల్లో 193 రన్స్ బాదేశాడు! (వీడియో)
టీ10 క్రికెట్ చరిత్రలో వ్యక్తిగత అత్యధిక స్కోరు రికార్డు నమోదైంది. ఎడమచేతి వాటం బ్యాటర్ హంజా సలీమ్ చరిత్ర సృష్టించాడు. 43 బంతుల్లో ఏకంగా 193 పరుగులు చేసి.. ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. యూరోపియన్ టీ10 లీగ్ లో కాటలున్యా జాగ్వార్ తరపున ఆడుతున్న హంజా సలీమ్ సోహల్ హాస్పటల్టెట్ జట్టుపై ఈ ఘనత సాధించాడు.
హంజా సలీమ్ సిక్సర్లు, బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడు 22 సిక్సర్లు, 14 బౌండరీలు బాదాడు. అతడు ఆడిన 43 బంతుల్లో 36 బంతుల్ని బౌండరీకి తరలించడం విశేషం. అంతకుముందు టీ10 క్రికెట్ లో వ్యక్తిగత అత్యధిక స్కోరు 163గా ఉండేది. ఈ రికార్డును హంజా సలీమ్ బద్దలుకొట్టాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన కాటలున్యా జాగ్వార్ పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 257 పరుగులు చేసింది. హంజా సలీంకి తోడుగా వచ్చిన మరో ఓపెనర్ యాసిర్ అలీ 19 బంతుల్లో 58 పరుగులు చేశాడు.
భారీ ఛేదనకు దిగిన సోహల్ హాస్పటల్టెట్ పది ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 104 పరుగులే చేసింది. బ్యాటుతో విధ్వంసం చేసిన హంజా సలీమ్ మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. సోహల్ హాస్పటల్టెట్ జట్టులో షాజద్ 22 చేసిన పరుగులే అత్యధిక స్కోరు. అతడు 13 బంతుల్లో ఎదుర్కొని 22 రన్స్ చేశాడు. సర్ఫరాజ్, ఫరూక్, అమీర్, ఉమర్ తలో వికెట్ తీశారు.
కాగా, సోహల్ హాస్పటల్టెట్ జట్టుపై గెలిచిన ఉత్సాహంతో కాటలున్యా జాగ్వార్ మరో ఘన విజయం సాధించింది. గురువారం బెంగాలీ సీసీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఘనంగా గెలిచింది. మరోవైపు సోహల్ హాస్పటల్టెట్ జట్టు బెంగాలీ సీసీ టీమ్ తో ఇవాళ తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications