Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్‌లను గెలిపించిన క్యాచ్‌లు ఇవే! కపిల్‌దేవ్ టూ సూర్య (Video)

టీ20 వరల్డ్ కప్‌-2024 ఛాంపియన్‌గా టీమిండియా నిలిచింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచింది. సమష్టి విజయంతో రోహిత్ సేన విజయం సాధించింది. కానీ ఫైనల్ పోరులో గేమ్ ఛేజింగ్ మూమెంట్ మాత్రం.. సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌!నరాలు తెగే ఉత్కంఠలో సూర్య కష్టమైన క్యాచ్‌ను అందుకున్న తీరు చరిత్రలో నిలిచిపోతుంది.

ఓ క్యాచ్ ప్రపంచకప్‌ను గెలిపిస్తుందనడానికి ఇది మూడో ఉదాహరణ. భారత్ గెలిచిన నాలుగు ప్రపంచకప్‌ల్లో స్టన్నింగ్ క్యాచ్‌లతోనే మూడు సార్లు ట్రోఫీ సాధ్యమైంది. దేశానికి కపిల్ దేవ్ మొదటిసారి ప్రపంచకప్‌ను అందించాడు. 1983 వరల్డ్ కప్‌లో అండర్‌డాగ్స్‌లో అడుగుపెట్టిన భారత్..బలమైన జట్లను మట్టికరిపించి జగజ్జేతగా నిలిచింది. అయితే ఒత్తిడి‌తో కొనసాగిన ఫైనల్‌లో టీమిండియా గెలవడంలో ప్రధాన పాత్ర వహించింది కపిల్‌దేవ్ అందుకున్న క్యాచ్.

World Cup-Winning Catches Kapil Dev to Suryakumar Yadav - Watch the Video

అప్పటి ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్ వివ్ రిచర్డ్స్‌‌ క్యాచ్‌ను కపిల్‌దేవ్ అందుకోవడం గేమ్ ఛేజింగ్ మూమెంట్. దాదాపు 20 గజాల పాటు కపిల్ వెనక్కి పరిగెత్తుతూ బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు. అది చేజార్చితే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఇక 2007 టీ20 ప్రపంచకప్‌లో శ్రీశాంత్ అందుకున్న క్యాచ్ అంత తేలికైనది కాదు. కపిల్‌దేవ్ అందుకున్న క్యాచ్ కష్టతరమైనది. అది చేజారినా గొప్ప ప్రయత్నమని కపిల్‌కు మద్దతు దొరికేది. కానీ శ్రీశాంత్‌ పరిస్థితిది అలా కాదు.

అక్కడ శ్రీశాంత్ ఒక్కడే ఉన్నాడు. మిస్బా ఉల్ హక్ భారీ షాట్‌కు యత్నించగా బంతి గాల్లోకి లేచింది. నాలుగు సెకన్ల పాటు బంతి గాల్లోనే ఉన్న సమయంలో శ్రీశాంత్ గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంది. క్యాచ్ చేజారితే కప్ చేజారినట్లే. అలాంటి ఒత్తిడిలో శ్రీశాంత్ బంతికి గొప్పగా ఒడిసిపట్టాడు. తొలి టీ20 వరల్డ్ కప్ సమరంలో దేశాన్ని విజేతగా నిలపడంలో ప్రధాన పాత్ర వహించాడు. ఇక ఈ రెండింటికి మించిన క్యాచ్ సూర్యకుమార్‌ది.

ఓ వైపు బంతిని గమనిస్తూ.. మరోవైపు బౌండరీ రోప్‌ను అంచనా వేస్తూ... చిరుతలా పరిగెత్తుతూ సూర్యకుమార్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఈ ప్రక్రియలో అదుపుతప్పి బౌండరీ లైన్ అవతలకు కూడా సూర్య వెళ్లాల్సి వచ్చింది. కానీ సమయస్ఫూర్తితో వ్యవహిరించి మిల్లర్‌ను ఔట్ చేసి జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. సూర్య అందుకున్న క్యాచ్ సిక్సర్‌గా మారినా, మిల్లర్ బతికిపోయినా పరిస్థితి మరోలా ఉండేది.

Story first published: Monday, July 1, 2024, 11:46 [IST]
Other articles published on Jul 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+