
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తన సన్నాహకాన్ని పరాజయంతో మొదలు పెట్టింది. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ 3 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై గెలిచింది. ఈ విజయంతో ఆప్ఘనిస్థాన్ ప్రపంచకప్‌లో అందరినీ ఆకర్షించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 47.5 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాట్స్‌మెన్లలో బాబర్ ఆజమ్ (112; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, షోయబ్ మాలిక్ (44) ఫరవాలేదనిపించారు. ఆప్ఘన్ బౌలర్లలో మహ్మద్ నబీ మూడు, దౌలత్ జద్రాన్, రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసి విజయం సాధించింది. హస్మతుల్లా షాహిది (74 నాటౌట్; 102 బంతుల్లో 7ఫోర్లు) అప్ఘన్ విజయంలో కీలక పాత్ర పోషించగా... హజ్రతుల్లా (49; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)రాణించగా, రహ్మత్ షా (32; 2 ఫోర్లు, 1 సిక్స్), నబీ (34; 3 ఫోర్లు) రాణించారు.
పాక్ బౌలర్లలో వహాబ్ రియాజ్ మూడు వికెట్లు తీయగా... ఇమాద్ వసీమ్ రెండు వికెట్లు తీశారు.