Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రిస్టల్‌లో బౌండరీల వర్షం: వార్మప్ మ్యాచ్‌లో కివీస్ టార్గెట్ 422

World Cup warm-up match: Windies ride on Hopes ton, set New Zealand daunting target of 422

హైదరాబాద్: బ్రిస్టల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండిస్ జట్టు పరుగుల వరద పారించారు. మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తూ న్యూజిలాండ్‌ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెస్టిండిస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్ జట్టు 49.2 ఓవర్లలో 421 పరుగులు చేసి ఆలౌటైంది. వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్లలో హోప్ 86 బంతుల్లో 101(9 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీతో చెలరేగగా ఆండ్రీ రస్సెల్ 25 బంతుల్లో 54(7 ఫోర్లు, 3 సిక్సులు), లివీస్ 54 బంతుల్లో 50(6 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

ఆ తర్వాత హెట్‌మెయిర్ (47), క్రిస్ గేల్ (36) రాణించడంతో వెస్టిండిస్ ఏకంగా నాలుగు వందల పరుగులు మైలురాయిని అందుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు తీయగా హెర్నీ రెండు, జేమ్స్ నీశమ్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.

Story first published: Tuesday, May 28, 2019, 19:42 [IST]
Other articles published on May 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+