For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'విరాట్' రూపం: ఆసీస్‌పై విజయం, సెమీస్‌కు భారత్

By Pratap

మొహాలీ: ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌కు విజయాన్ని సాధించి పెట్టాడు. ఆస్ట్రేలియా తన ముందు ఉంచిన 161 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించి సెమీస్‌కు చేరుకుంది.

ఆరు బంతులకు నాలుగు పరుగులు కావాల్సిన స్థితిలో ఫోర్ బాది మహేంద్ర సింగ్ ధోనీయే మ్యాచును ఫనిష్ చేశాడు. విరాట్ కోహ్లీ 2 సిక్స్‌లు, 9 ఫోర్లతో 51 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. చివరలో ఫోర్లతో ఆస్ట్రేలియా బౌలర్లను కంగారెత్తించాడు. విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈ నెల 31వ తేదీన సెమీ ఫైనల్ లో భారత్ వెస్టిండీస్ పై ఆడుతుంది.

ఫోటో గ్యాలేరి: వరల్డ్ T20

ధోనీ, కోహ్లీ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతూ ఒక పరుగు వచ్చే చోట రెండు పరుగులుగా మార్చుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా ఫీల్డర్లపై ఒత్తిడి పెరిగింది. ధోనీ బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. షేన్ వాట్సన్ పొదుపుగా పరుగులు ఇస్తూ నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీశాడు. వాట్సన్ బౌలింగు చేసినంత వరకు భారత్‌కు పరుగులు రాబట్టడం కష్టమే అయింది. ఫౌల్కనర్, కౌల్టర్ నీలే తలో వికెట్ తీసుకున్నారు.

World Cup T20: Australia bat; both teams unchanged

ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియా తన ముందు ఉంచిన 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 23 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడే క్రమంలో శిఖర్ ధావన్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కౌల్టన్ నీలె బౌలింగులో వెనుదిరిగాడు.

దూకుడుగా ఆడే క్రమంలో యువరాజ్ సింగ్ జేమ్స్ ఫౌల్కనర్ బౌలింగులో 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో 13.5 ఓవర్ల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.

భారత్ 49 పరుగుల వద్ద మూడో వికెట్‌ను జారవిడుచుకుంది. సురేష్ రైనా 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాట్సన్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.

భారత్ 37 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ షేన్ వాట్సన్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.

World Cup T20: Australia bat; both teams unchanged

ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులో ఆస్ట్లేలియా భారత్‌పై ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి. నెహ్రా, బుమ్రా, అశ్విన్, యువరాజ్ సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత్‌పై ఆస్ట్రేలియా 4.2 ఓవర్ల తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న క్రమంలో ఖవాజా 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆశిష్ నెహ్రా బౌలింగులో పెవిలియన్ దారి పట్టాడు.

ఆస్ట్రేలియా 145 పరుగులకు ఆరో వికెట్ కోల్పోయింది. ఐదు బంతులు మిగిలి ఉన్న స్థితిలో ఆరో వికెట్ పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగులో ఫౌల్కనర్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు.

బుమ్రా దూకుడుగా ఆడుతున్న మాక్స్‌వెల్‌ (31)ను ఔట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 130 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను జారవిడుచుకుంది.

ఆస్ట్రేలియా 100 పరుగుల స్కోరు వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న ఆరోన్ ఫించ్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగులో అవుటయ్యాడు.

World Cup T20: Australia bat; both teams unchanged

భారత్‌పై ఆస్ట్రేలియా 72 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగులో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డేవిడ్ వార్నర్ వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా ఆ తర్వాత వెంటనే మూడో వికెట్ కోల్పోయింది. 74 పరుగుల స్కోరు వద్ద మూడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. యువరాజ్ సింగ్‌ బౌలింగులో స్టీవ్ స్మిత్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన కీలకమైన మ్యాచులో ఆస్ట్రేలియా భారత్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచు రెండు జట్లకు కూడా కీలకమైన దశలో భారత్ విజయాన్ని దక్కించుకుని సెమీ ఫైనల్ కు చేరుకుంది.

పరాజయం పాలైన ఆస్ట్రేలియా జట్టు ఇంటి ముఖం పట్టింది. రెండు జట్లలో కూడా తుది ఆటగాళ్లలో ఏ విధమైన మార్పులు చేయలేదు. ఆ మ్యాచులో గెలిచిన భారత జట్టు ఈ నెల 31వ తేదీన సెమీ ఫైనల్లో వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంటుంది. గ్రూప్ 1లో వెస్టిండీస్ అగ్రస్థానంలో నిలించింది. తొలి సెమీ ఫైనల్ మార్చి 30వ తేదీన న్యూజిలాండ్, ఇంగ్లాండు మధ్య న్యూఢిల్లీలో జరుగుతుంది.

తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, ఆశిష్ నెహ్రా, జస్‌ప్రీత్ సింగ్ బుమ్రా

ఆస్ట్రేలియా: ఫించ్, ఖవాజా, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్, షేన్ వాట్సన్, ఫౌల్కనర్, పీటర్ నెవిల్, జంపా, కౌల్టర్ నీలే, హాజిల్‌వుడ్

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+