హైదరాబాద్: ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన భారత మహిళా జట్టులోని రైల్వే క్రికెటర్లకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. ప్రమోషన్‌తో పాటు నగదు ప్రోత్సాహకాలిస్తామని, భారత్ మహిళా జట్టు ఫైనల్లో గెలువాలని ఆకాంక్షిస్తూ ఆయన ప్రకటన చేశారు.
ఈ మేరకు రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్( ఆర్‌ఎస్‌పీబీ) సెక్రటరీ రేఖా యాదవ్ ఆదివారం మీడియాకు తెలిపారు. మిథాలీ నేతృత్వంలోని భారత మహిళల జట్టులోని 15 మంది సభ్యుల్లో 10 మంది రైల్వే ఉద్యోగులు ఉండటం విశేషం.
కెప్టెన్ మిథాలీతో సహా వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఎక్తా బిష్త్, పూనమ్ రౌత్, వేధ కృష్ణమూర్తి, పూనమ్ యాదవ్, సుష్మా వర్మ, మోనా మెశ్రామ్, రాజేశ్వరి గైక్వాడ్, నుజాత్ పర్విన్‌లు రైల్వే ఉద్యోగులుగా ఉన్నారు.
వీరి అద్భుత ప్రదర్శనతోనే భారత మహిళల జట్టు ఉమెన్ వరల్డ్ కప్‌లో పైనల్‌కు చేరిందని రైల్వే శాఖ సంతోషం వ్యక్తం చేసింది. రైల్వే పాలసీ ప్రకారం నగదు ప్రోత్సాహకాలిస్తామని కూడా ఆమె అన్నారు. ఈ టోర్నీలో మిథాలీ వన్డేల్లో ప్రపంచ రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే.