For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

#OnThisDay: స్టాండ్లకు నిప్పుపెట్టిన ఫ్యాన్స్, మైదానంలోకి బాటిళ్లు (ఫోటోలు)

By Nageshwara Rao
 World Cup semi-final: The good, the bad and the downright ugly

హైదరాబాద్: #OnThisDay పేరిట గతంలో చోటు చేసుకున్న అనేక మ్యాచ్‌లకు సంబంధించిన విషయాలను ఐసీసీ అభిమానుల కోసం తన ట్విట్టర్‌లో పంచుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున భారత క్రికెట్‌లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. 1996 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిచ్చింది.

ఈ వరల్డ్ కప్‌లో భాగంగా 1996 మార్చి 13న కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అవమానకర రీతిలో ఓటమి పాలైంది. దీంతో అభిమానుల ఆగ్రహావేశాల మధ్య పోటీ నుంచి నిష్క్రమించింది.

వరల్డ్‌కప్ సాధిస్తారని కలలు కన్న భారత్ అభిమానులకు కన్నీళ్లే మిగిలాయి. దీంతో అభిమానులు ఆవేశానికి లోనయ్యారు. స్టేడియాన్ని తగలబెట్టడంతో పాటు మైదానంలోకి బాటిళ్లు విసిరారు. ఒక బ్లాక్‌ డేగా మిగిలి పోయిన ఆనాటి మ్యాచ్‌కు సంబంధించిన విషయాలు మీకోసం...

 టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

అజహరుద్దీన్ నాయకత్వంలోని టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక ఆ తర్వాత మ్యాచ్‌లో పుంచుకున్న తీరు అద్భుతం. ఈ మ్యాచ్‌లో అరవింద్ డిసిల్వా, రోహన్ మహనామ హాఫ్ సెంచరీలతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. డిసిల్వా 47 బంతుల్లో 14 ఫోర్లతో 66 పరుగులు నమోదు చేశాడు. మరోవైపు మహనామ జాగ్రత్తగా ఆడి 101 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేశాడు.

భారత్ విజయ లక్ష్యం 252 పరుగులు

భారత్ విజయ లక్ష్యం 252 పరుగులు

అనంతరం 252 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే సచిన్ టెండూల్కర్, మంజ్రేకర్ నెమ్మదిగా ఆడటంతో 98 పరుగుల వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 98 పరుగుల వద్ద సచిన్ రెండో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజహరుద్దీన్ డకౌట్ కావడంతో 99 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత నుంచీ భారత్ వరుసగా వికెట్లను చేజార్చుకుంది.

 స్టాండ్లకు నిప్పుపెట్టిన అభిమానులు

స్టాండ్లకు నిప్పుపెట్టిన అభిమానులు

వచ్చిన బ్యాట్స్ మన్ వచ్చినట్టే పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 34.1 ఓవరల్లో 120 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్ పరుగులేమీ చేయకుండా డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కనీస పోరాటపటిమ కనబరచకుండా టీమిండియా బ్యాట్స్‌మెన్‌ నిష్క్రమించడంతో మైదానంలోని ప్రేక్షకులు స్టేడియంలోని కొన్ని స్టాండ్లకు నిప్పుపెట్టారు. వాటర్ బాటిళ్లు మైదానంలోకి విసిరేశారు. దీంతో కొద్దిసేపు మ్యాచ్ నిలిచిపోయింది.

తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత్

తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత్

ఆట మళ్లీ మొదలైన కాసేపటి తర్వాత కూడా అభిమానుల గొడవ కొనసాగించారు. మరోసారి మైదానంలోకి బాటిళ్లు విసిరారు. దీంతో ఈ మ్యాచ్‌కు రిఫరీగా ఉన్న వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ ఆటను నిలిపివేశారు. అప్పటివరకు నమోదైన స్కోరు ప్రకారం శ్రీలంక గెలిచినట్టు ప్రకటించారు. దీంతో తొలిసారిగా శ్రీలంక వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫైనల్లో ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించిన శ్రీలంక తొలిసారిగా విశ్వవిజేతగా అవతరించింది.

Story first published: Tuesday, March 13, 2018, 16:11 [IST]
Other articles published on Mar 13, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+