Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నో ఫ్లైజోన్: స్టేడియం మీదుగా విమానాల రాకపోక‌లు నిషేధం..గ‌గ‌న‌త‌లం మూసివేత‌

World Cup Semi Final: Airspace Over Old Trafford To Remain Shut During Match, English Board Tells BCCI

మాంచెస్ట‌ర్‌: ప్ర‌పంచ‌క‌ప్ తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌కు వేదికైన మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియాన్ని నో ఫ్లైజోన్‌గా ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారులు భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) వెల్ల‌డించారు. ఈ మేర‌కు అధికారికంగా లేఖ రాశారు. మ్యాచ్ ముగిసేంత వ‌ర‌కూ స్టేడియం మీదుగా ఎలాంటి విమానాలు రాక‌పోక‌లు సాగించ‌బోవ‌ని ఈసీబీ అధికారులు స్ప‌ష్టం చేశారు. మ్యాచ్ ఆరంభానికి కొద్దిసేప‌టి ముందే ఈసీబీ అధికారులు ఈ విష‌యాన్ని బీసీసీఐకి అధికారికంగా తెలియ‌జేశారు.

భార‌త క్రికెట్ జ‌ట్టు త‌న చిట్ట‌చివ‌రి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ కోసం లీడ్స్‌లోని హెడింగ్లే కార్నెజ్ స్టేడియంలో శ్రీలంక‌తో ఆడుతున్న సంద‌ర్భంగా.. గుర్తు తెలియని వ్య‌క్తులు ఆకాశంలో వివాదాస్ప‌ద‌మైన బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. జ‌స్టిస్ ఫ‌ర్ కాశ్మీర్ అని రాసిన బ్యాన‌ర్‌ను కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు తేలిక‌పాటి విమానం ద్వారా ప్ర‌ద‌ర్శించారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ తీవ్రంగా ప‌రిగ‌ణించింది. ఇలాంటి సంఘ‌ట‌న మ‌రోసారి పున‌రావృతం కాకుండా చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

దీనికి స్పందించిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అధికారులు.. ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. సెమీఫైన‌ల్‌కు ఆతిథ్యం ఇస్తోన్న ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియాన్ని నో ఫ్లైజోన్‌గా ప్ర‌క‌టించారు. ఎయిర్‌స్పేస్‌ను మూసివేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో టీమిండియా.. న్యూజిలాండ్‌ను ఢీ కొడుతోంది. టాస్ గెలిచిన బ్లాక్ క్యాప్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు.

1
43689

{headtohead_cricket_3_4}

Story first published: Tuesday, July 9, 2019, 14:54 [IST]
Other articles published on Jul 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+