For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాదే పైచేయి, 35ఏళ్లలో భారత్ గెలిచింది ఒక్కటే, ఎవరు ఎప్పుడు?

By Srinivas

సిడ్నీ: సిడ్నీ క్రికెట్ మైదానం (ఎస్సీజీ)లో భారత జట్టు రికార్డ్ పేలవంగా ఉంది. మార్చి 26వ తేదీన సెమీఫైనల్లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌కు వేదికైన ఎస్సీజీలో భారత్‌కు మంచి రికార్డ్ లేదు. అదే సమయంలో ఆస్ట్రేలియాకు మంచి రికార్డ్ ఉంది.

మహేంద్ర సింగ్ ధోనీ ఈ ప్రపంచ కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. అంతేకాకుండా... గ్రూప్ దశలో పాకిస్తాన్ పైన గెలిచి ప్రపంచ కప్ ఆ జట్టు పైన ఓటమి లేకుండా చరిత్రను కొనసాగించింది. సౌతాఫ్రికా పైన గెలిచి.. ప్రపంచ కప్‌‍లో ఆ జట్టు పైన గెలిచిన రికార్డ్ లేని చరిత్రను తిరగరాసింది. వీటిని పరిశీలిస్తే ఎస్సీజీలో భారత్‌కు పేలవ రికార్డ్ ఉన్నప్పటికీ ధోనీ సేవ హవా కొనసాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

35 ఏళ్లలో సిడ్నీ క్రికెట్ మైదానం (ఎస్సీజీ)లో ఆడిన పలు మ్యాచుల్లో భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే ఆసిస్ జట్టును ఓడించింది. ప్రస్తుతం జట్టు దూకుడు, గత నాలుగు మ్యాచులు చూస్తే ధోనీ సేన పైన ఆశలు పెట్టుకోవచ్చునని చెబుతున్నారు.

భారత్, ఆస్ట్రేలియా జట్లు ఎస్సీజిలో మొదటిసారి 1980 డిసెంబర్ 18న తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలిచింది. అప్పటి నుండి 28 ఏళ్ల వరకు ఈ మైదానంలో ఆడిన ప్రతిసారి ఆస్ట్రేలియాదే పైచేయి. 2008 వరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది.

అయితే, 2008 మార్చి 2న జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ ట్రై సిరీస్ ఫైనల్లో మాత్రం అది రివర్స్ అయింది. అప్పుడు భారత్ గెలిచింది. నాడు సచిన్ సెంచరీ చేశాడు. భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆసిస్ పైన గెలిచి క్లించ్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

మొత్తంగా ఎస్సీజీలో భారత్ 17 మ్యాచ్‌లు ఆడింది. అందులో నాలుగు గెలిచింది. ఒకదాంట్లో ఫలితం రాలేదు. ఫలితం రాని మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడిందే. భారత్ గెలిచిన నాలుగు జట్లలో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.

ఎస్సీజీలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఇలా...

ఎస్సీజీలో భారత్ - ఆస్ట్రేలియా జట్లు మొత్తం 14 మ్యాచులు ఆడాయి. ఆస్ట్రేలియా 12 గెలవగా, భారత్ ఒక మ్యాచ్ గెలిచింది. ఓక దాంట్లో ఫలితం రాలేది.

World Cup semi-final: Advantage Australia as India have beaten hosts only once in 35 years at SCG

1. 18 డిసెంబర్ 1980 - 9 వికెట్లతో ఆస్ట్రేలియా గెలిచింది.
2. 8 జనవరి 1981 - 9 వికెట్లతో ఆస్ట్రేలియా గెలిచింది.
3. 15 జనవరి 1981 - 27 పరుగులతో ఆస్ట్రేలియా గెలిచింది.
4. 21 జనవరి 1986 - 100 పరుగులతో ఆస్ట్రేలియా గెలిచింది.
5. 5 జనవరి 1986 - 11 పరుగులతో ఆస్ట్రేలియా గెలిచింది.
6. 14 జనవరి 1992 - 9 వికెట్లతో ఆస్ట్రేలియా గెలిచింది.
7. 20 జనవరి 1992 - 6 పరుగులతో ఆస్ట్రేలియా గెలిచింది.
8. 14 జనవరి 2000 - 5 వికెట్లతో ఆస్ట్రేలియా గెలిచింది.
9. 22 జనవరి 2004 - 2 వికెట్లతో ఆస్ట్రేలియా గెలిచింది.
10. 8 ఫిబ్రవరి 2004 - 208 పరుగులతో ఆస్ట్రేలియా గెలిచింది.
11. 24 ఫిబ్రవరి 2008 - 18 పరుగులతో ఆస్ట్రేలియా గెలిచింది.
12. 2 మార్చి 2008 - 6 వికెట్లతో భారత్ గెలిచింది.
13. 26 ఫిబ్రవరి 2012 - 87 పరుగులతో ఆస్ట్రేలియా గెలిచింది.
14. 26 జనవరి 2015 - ఫలితం రాలేదు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+