Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: బ్యాట్స్‌మెన్లకు సచిన్ వార్నింగ్... ఒక్క విషయంలో జాగ్రత్త

దుబాయ్: ఐసీసీ వరల్డ్ కప్, అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శనివారం నుంచి ప్రారంభం అవుతున్న ఐసీసీ టోర్నీలో ఆడే బ్యాట్స్ మెన్లకు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా అక్కడి వాతావరణ పరిస్ధితులతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

ఈ ఏడాది వరల్డ్ కప్‌ను ఆస్టేలియా-న్యూజిలాండ్ దేశాలు ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌లో భౌగోళిక పరిస్ధితుల కారణంగా కొన్ని వేదికల్లో గాలి ఎక్కువగా వీస్తుండటంపై సచిన్ టెండూల్కర్, బ్యాట్స్‌మెన్ ఇందుకు సిద్ధంగా ఉండాలని బుధవారం ఐసీసీ వెబ్‌సైట్‌కు రాసిన కథనంలో పేర్కొన్నారు.

అక్కడ వీచే గాలులు చాలా వేగంగా బ్యాట్స్‌మెన్ టైమింగ్‌ను సైతం దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. బంతులు వేగంగా దూసుకొస్తాయని ఆ సందర్భంలో మీరు వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్‌కు న్యూజిలాండ్ ఎంతో ప్రత్యేకం.

World Cup: Sachin Tendulkar warns batsmen of one 'strong' factor

అంతర్జాతీయ వన్డే క్రికెట్లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ (1994)లో స్టేడియంలోనే సచిన్ టెండూల్కర్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా అరంగేట్రం చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత నుంచి తాను ఓపెనింగ్ బ్యాట్స్ మెన్‌గా క్రికెట్‌ను బాగా ఎంజాయ్ చేశానని అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ 2013లో రిటైర్‌మెంట్ ప్రకటించారు.

ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం ఆస్టేలియాలో 7, న్యూజిలాండ్‌లో 7 వేదికలను ఎంపిక చేశారు. ఐసీసీ వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్ న్యూజిలాండ్-శ్రీలంక మధ్యన ఫిబ్రవరి 14న జరగనుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+