Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: శిఖర్ ధావన్ సక్సెస్... వెనుకున్న ఆ వ్యక్తి ఎవరు..?

మెల్‌బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్‌కు ముందు ఆస్టేలియాలో జరిగిన వన్డే, టెస్టు సిరిస్‌లో పూర్తిగా విఫలమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. టెస్టు, వన్డే సిరిస్‌లలో వైఫల్యమైన ధావన్‌ను వరల్డ్ కప్‌కు ఎందుకు ఎంపిక చేశారన్న క్రికెట్ విమర్శకులే, వరల్డ్ కప్‌లో ధావన్ ప్రదర్శనను చూసి ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో శిఖర్ ధావన్ రెండు సెంచీలు, ఒక అర్ధ సెంచరీతో 337 పరుగులు సాధించాడు. క్రికెట్ విమర్శకుల చేత తీవ్ర విమర్శలు పాలైన ధావన్ ఒక్కసారిగా వరల్డ్ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడం వెనుక ఓ వ్యక్తి శ్రమ ఉందని టీమిండియా సపోర్టింగ్ స్టాప్ ఒకరు తెలిపారు.

ఆ వ్యక్తి ఎవరో కాదు. మాజీ క్రికెటర్, ప్రస్తుతం టీం ఇండియాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి. జట్టు ఆటగాళ్లతో టీమిండియా డైరెక్టరైన రవిశాస్త్రి ఎప్పటికప్పుడు ఉద్వేగభరిత ప్రసంగాలు చేస్తుంటారు. ఆ ఉద్వేగభరిత ప్రసంగాలే ధావన్ విషయంలో పని చేశాయని చెప్పారు.

World Cup: Ravi Shastri's pep talk behind Shikhar Dhawan's success

వరల్డ్ కప్‌కు ముందు వరుస వైఫల్యాలను ఎదుర్కొంటున్న ధావన్‌ను రవిశాస్త్రి వ్యక్తిగతంగా కలిశారు. ఈ పెప్ టాక్‌లో వారిద్దరి మధ్య ఆటకు సంబంధించిన విషయాలు ఏమీ మాట్లాడుకోలేదని తెలిపారు. కేవలం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, మధురమైన కుటుంబ బాంధవ్యాలు, బాధ్యతలు గుర్తుచేయడం, సాధించగలమనే ధీమాను నేర్పడం, అతడి మనసులో చైతన్యవంతమైన స్ఫూర్తిని నిలపడం వంటివే చేశారని తెలుస్తోంది.

ఐసీసీ వరల్డ్ కప్‌లో వరుస విజయాలను నమోదు చేసి టీమిండియా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో భారత జట్టును సంతోషరిచే నిర్ణయాన్ని బీసీసీఐ సోమవారం తీసుకుంది. క్వార్టర్ ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధించడంతో ఆటగాళ్ల వెంట తమ భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌ను ఉంచేందుకు అనుమతించింది.

శిఖర్ ధావన్ ఇప్పటికే తన భార్య ఆయేషాతో కలిసి మెల్‌బోర్న్ వీధుల్లో షాపింగ్ చేస్తూ కనిపించారు. ఉమేష్ యాదవ్ భార్య తాన్య ఇప్పటికే ఆస్టేలియాకు చేరుకోగా, అజ్యంకె రహానే గర్ల్ ఫ్రెండ్ రాధిక బుధవారం మెల్ బోర్న్‌కు రానున్నట్లు తెలుస్తోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+