Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: అదరగొట్టిన పాకిస్తాన్, పసికూనలు కెన్యాపై ఘన విజయం

Shahid Afridi
హంబన్‌టోటా: అనిశ్చిత ఆటతీరుకు మారుపేరైన పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్‌లోని తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్రిది బృందం ఏకంగా 205 పరుగుల ఆధిక్యంతో నెగ్గి ప్రపంచకప్‌లోనే తమ అత్యుత్తమ విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 317 పరుగులు సాధించింది. కమ్రాన్ అక్మల్ (67 బంతుల్లో 5 ఫోర్లతో 55), యూనిస్ ఖాన్ (67 బంతుల్లో 2 ఫోర్లతో 50), మిస్బా (69 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 65), ఉమర్ అక్మల్ (52 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 71) అర్ధసెంచరీలతో రాణించారు.

అనంతరం కెన్యా 33.1 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటై ఈ టోర్నీలో వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. కెప్టెన్ ఆఫ్రిది (5/16) స్పిన్ మాయాజాలానికి కెన్యా ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. కొలిన్స్ ఒబుయా (58 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 47) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. పాక్ బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు లభించింది. తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఈనెల 26న శ్రీలంకతో; కెన్యా మార్చి 1న శ్రీలంకతో తలపడతాయి.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌కు ఓపెనర్లు హఫీజ్, షెహజాద్ శుభారంభాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు. 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పాక్‌ను కమ్రాన్, యూనిస్ మూడో వికెట్‌కు 98 పరుగులు జోడించి చక్కదిద్దారు. తర్వాత మిస్బా, ఉమర్ అక్మల్ ధాటిగా ఆడి ఐదో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. చివర్లో వరుస బంతుల్లో ఉమర్, ఆఫ్రిది అవుటైనా... కెన్యా చివరి 9 బంతుల్లో 27 పరుగులు సమర్పించుకుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+