Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: గాయం, యూఏఈతో జరిగే మ్యాచ్‌‌‌కి షమీ దూరం

పెర్త్: ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 27(శనివారం)న భారత్-యూఏఈల మధ్య పెర్త్‌లో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ దూరమయ్యాడు. అతని స్ధానాన్ని భువనేశ్వర్ కుమార్ భర్తీ చేయనున్నాడు.

పేసర్ మహమ్మద్ షమీకి ఎడమ మోకాలికి గాయం కారణంగా అతనిని మ్యాచ్ నుంచి తప్పించినట్లు టీమిండియా మీడియా మేనేజర్ ఆర్ బాబా తెలిపారు. గురువారం నాడు షమీకి ఆల్ట్రా సౌండ్ ఇంజెక్షన్ ఇచ్చామని దీంతో అతని శనివారం జరిగే మ్యాచ్‌లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.

World Cup: Mohammed Shami ruled out of UAE game

జట్టులో షమీ స్ధానాన్ని భువనేశ్వర్ కుమార్ భర్తీ చేయనున్నట్లు తెలిపాడు. ఐసీసీ టోర్నమెంట్లో ఇప్పటి వరకు టీమిండియా ఆడిన మ్యాచ్‌ల్లో ఎక్కువ వికెట్లు షమీ తీసుకున్నాడు. పాకిస్ధాన్, దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో షమీ 10.83 సగటుతో 6 వికెట్లు తీసుకున్నాడు.

రెండు ఇన్నింగ్స్‌ల్లో 17 ఓవర్లు వేసిన షమీ, 2 మేడిన్లతో 6/65గా నమోదు చేశాడు. పాకిస్ధాన్‌పై జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసుకోగా, దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీసుకున్నాడు. 24 ఏళ్ల మహమ్మద్ షమీ ఇప్పటి వరకు 42 వన్డేలు ఆడి 76 వికెట్లు తీసుకున్నాడు. మార్చి 6న వెస్టిండిస్‌తో జరిగే మ్యాచ్‌కి తిరిగి జట్టులోకి వస్తాడని తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:11 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+