For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిబ్రవరిలో ఏం జరిగిందంటే!: అంబటి రాయుడి ఉంటే టీమిండియా గెలిచేదే!

ICC Cricket World Cup 2019 : World Cup Loss Triggers Talk Of Rayudu And His Heroics Against NZ
World Cup loss triggers talk of Rayudu and his heroics against New Zealand in February

హైదరాబాద్: ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా బుధవారం జరిగిన తొలి సెమీపైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోవడంతో మరోసారి టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడి పేరు తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో టీమిండియాకు 240 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేసించింది. స్వల్ప లక్ష్యమే కావడంతో న్యూజిలాండ్ నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని టీమిండియా టాపార్డర్ ఛేదించేస్తుందని భారత అభిమానులు సంబరపడ్డారు. అయితే, మ్యాచ్ మొదలైన తర్వాత కానీ, తెలియదు అభిమానుల ఆశలు ఆవిరయ్యాయని!

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ముగ్గురూ ఒక్కో పరుగుకే పరిమితం కావడంతో 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. అయితే, సరిగ్గా ఐదు నెలల క్రితం టీమిండియాకు వెల్లింగ్టన్‌లో ఇదే పరిస్థితి ఎదురైనప్పటికీ అప్పుడు అంబటి రాయుడు జట్టుని గెలిపించాడు.

240 పరుగుల విజయ లక్ష్యంతో

240 పరుగుల విజయ లక్ష్యంతో

మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీపైనల్లో 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి టీమిండియా 10 ఓవర్లకు గాను 24/4 స్థితిలో ఉంది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రవీంద్ర జడేజా (59 బంతుల్లో 77) అద్భుతంగా పోరాడినప్పటికీ... మరో 3 బంతులు మిగిలుండగానే 221 పరుగులకేకుప్పకూలిన టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఫిబ్రవరిలో వెల్లింగ్టన్ వేదికగా

ఫిబ్రవరిలో వెల్లింగ్టన్ వేదికగా

అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి పవర్ ప్లేలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, శుభమాన్ గిల్, ధోని వికెట్లను కోల్పోయ టీమిండియా 22/4 స్థితిలో ఉంది. ఇలాంటి స్థితిలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు విజయాన్ని అందించాడు.

113 బంతుల్లో 90 పరుగులు చేసిన రాయుడు

113 బంతుల్లో 90 పరుగులు చేసిన రాయుడు

ఈ క్రమంలో అంబటి రాయుడు 113 బంతుల్లో 90 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్ మిడిలార్డర్‌లో అంబటి రాయుడు ఉంటే జట్టు ఫలితం మరోలా ఉండేదని నెటిజన్లు సోషల్ మీడియాలో అంటున్నారు.

స్టాండ్ బై జాబితాలో అంబటి పేరు

స్టాండ్ బై జాబితాలో అంబటి పేరు

నిజానికి ఈ ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అంబటి రాయుడితో పాటు రిషబ్ పంత్‌ని స్టాండ్‌బై జాబితాలో బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. తొలుత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడి టోర్నీకి దూరమైనప్పుడు ఆ స్థానంలో రిషబ్‌ పంత్‌ను ఇంగ్లాండ్‌కు పిలిపించారు. ఆ తర్వాత రాయుడి స్థానంలో ప్రపంచకప్‌కు ఎంపికైన విజయ్ శంకర్ కూడా గాయపడ్డాడు.

రాయుడికి పిలుపు వస్తుందని అంతా!

రాయుడికి పిలుపు వస్తుందని అంతా!

దీంతో అంబటి రాయుడికి పిలుపు వస్తుందని అంతా భావించారు. అయితే, సెలక్టర్లు అనూహ్యంగా రాయుడిని కాకుండా విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. దీంతో మనస్తాపం చెందిన అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అలా కాకుండా తొలి సెమీస్‌లో రాయుడి ఆడి ఉంటే టీమిండియా గెలిపించేవాడని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

1
43689

{headtohead_cricket_3_4}

Story first published: Thursday, July 11, 2019, 13:24 [IST]
Other articles published on Jul 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+