Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్‌కప్: 48 గంటల్లో అమ్ముడైన భారత్‌-పాక్ మ్యాచ్ టిక్కెట్లు

ICC Cricket World Cup 2019 : Ind V Pak World Cup Match Tickets Sold Out Within 48 Hours ! | Oneindia
World Cup: India-Pakistan Match Tickets Sold Out Within 48 Hours

క్రికెట్‌లో దాయాదులు భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. మైదానంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతాయి. భారత్‌-పాక్ మ్యాచ్ అంటే అభిమానులు కూడా మైందానంకు క్యూ కడతారు. ఇక వరల్డ్‌కప్‌లో పోటీపడుతున్నాయంటే ఆ మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

అయితే ఇంగ్లండ్‌ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచక్‌లో భారత్‌-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జూన్‌ 16న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌కు టిక్కెట్లు అన్ని హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. అమ్మకం మొదలుపెట్టిన 48 గంటల్లోనే టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయని క్రికెట్ లంకషైర్ మేనేజర్ డాన్ వైట్ హెడ్ వెల్లడించారు.

'ఇది చాలా పెద్ద మ్యాచ్. గత ఏడాది భారత్‌, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ కు అభిమానులు పోటెత్తారు. మైదానం మొత్తం భారత అభిమానులతో నిండిపోయింది. ఇది క్రికెట్ కు మేలు చేస్తోంది. అయితే ఇప్పుడు భారత్‌-పాక్ మ్యాచ్ కు అంతకంటే ఎక్కువ మంది రానున్నారు. భారీ డిమాండ్ దృష్ట్యా ఎక్కువ ప్యాకేజీలను సృష్టించాం. అయినా మా వద్ద ఇప్పుడు కొన్ని టిక్కెట్లు మాత్రమే ఉన్నాయి' అని డాన్ వైట్ హెడ్ తెలిపారు.

Story first published: Monday, May 6, 2019, 13:32 [IST]
Other articles published on May 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+