Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువరాజ్ సింగ్ చలువ: ఐర్లాండ్‌పై కష్టపడి గెలిచిన భారత్

Yuvraj Singh
బెంగళూరు: యువరాజ్ సింగ్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆదివారం భారత్‌ 5 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై కష్టపడి ఓడించింది. 208 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్‌పై విజయం సాధించి సంచలనం సృష్టించిన ఐర్లాండ్ భారత్‌కు చెమటలు పట్టించింది. ఐదు వికెట్లు తీసి, 50 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలిన యువరాజ్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. ఈ గెలుపుతో గ్రూప్‌ 'బి'లో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది.

బంతి నెమ్మదిగా వస్తున్న పిచ్‌పై స్వల్ప లక్ష్యఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే షాక్‌. 24 పరుగులకే సెహ్వాగ్‌, గంభీర్‌ ఇంటి ముఖంపట్టారు. ఆ దశలో సచిన్‌ (38; 56 బంతుల్లో 4X4), కోహ్లి (34; 53 బంతుల్లో 3X4) ఆదుకున్నారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ పరిస్థితిని చక్కదిద్దారు. 20 ఓవర్లకు 87/3తో భారత్‌ లక్ష్యం దిశగా సాఫీగానే సాగుతున్నట్లనిపించింది. కానీ 13 పరుగుల వ్యవధిలో సచిన్‌, కోహ్లి ఔటవడంతో ప్రమాదంలో పడింది. యువరాజ్‌తో సమన్వయం లోపించి కోహ్లి అనవసరంగా రనౌటయ్యాడు. 24వ ఓవర్లో స్కోరు 100/4.

ఆ స్థితిలో మరో వికెట్‌ పడుంటే పరిస్థితి మరింత సంక్లిష్టమయ్యేదే. కానీ యువరాజ్‌, ధోనీ ఆదుకున్నారు. ఒత్తిడిలో ఎంతో సంయమనాన్ని ప్రదర్శించారు. అస్సలు భారీ షాట్లకు పోలేదు. సింగిల్స్‌ తీస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఐర్లాండ్‌ ఆటగాళ్లు చక్కని ఫీల్డింగ్‌తో కొన్ని విలువైన పరుగులు ఆపారు. అయినా భారత్‌ లక్ష్యానికి చేరువైంది. 40 ఓవర్లలో స్కోరు 167. ఐతే ధోనీ డాక్రెల్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుతిరగడంతో 67 పరుగుల ఐదో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికి గెలవాలంటే 41 పరుగులు చేయాలి.

ఆ దశలో క్రీజులో వచ్చిన మెరుపు వీరుడు యూసుఫ్‌ పఠాన్‌ (30 నాటౌట్‌; 24 బంతుల్లో 2X4, 3X6) రెచ్చిపోయాడు. నాలుగు బంతుల్లోనే భారత్‌కు ఒత్తిడిని దూరం చేశాడు. విజయాన్ని ఖాయం చేశాడు. డాక్రెల్‌ బౌలింగ్‌లో తొలి బంతికి పరుగులేమీ చేయని పఠాన్‌ తర్వాత వరుసగా 4, 6, 6 బాదాడు. స్టిర్లింగ్‌ బౌలింగ్‌లో మరో సిక్స్‌ కొట్టాడు. పఠాన్‌ మరో బౌండరీతో భారత్‌ లక్ష్యాన్ని పూర్తి చేసింది. అంతకుముందు బంతికి సింగిల్‌తో యువరాజ్‌ అర్ధసెంచరీ సాధించాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+