వరల్డ్ కప్: మరో కోహ్లీ రికార్డుని బద్దలు కొట్టిన ఆమ్లా (ఫోటోలు)
కాన్ బెర్రా: ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో మరో రికార్డు బద్దలైంది. టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రికార్డుని దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా బద్దలు కొట్టాడు. ఐసీసీ వరల్డ్ కప్‌లో పూల్ బీలో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రికార్డుని అధిగమించాడు.
31ఏళ్ల హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వేగంగా 20 సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్‌పై జరుగుతున్న మ్యాచ్‌లో తన కెరీర్‌లో అత్యధిక పరుగులు 159 చేశాడు. 20 సెంచరీలను సాధించేందుకు హషీమ్ ఆమ్లా 108 ఇన్నింగ్స్‌ను ఆడాడు.

మరో కోహ్లీ రికార్డుని బద్దలు కొట్టిన ఆమ్లా
అదే భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 20 సెంచరీలు సాధించేందుకు గాను 133 ఇన్నింగ్స్‌ను ఆడాడు. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 22 సెంచరీలు సాధించాడు.

మరో కోహ్లీ రికార్డుని బద్దలు కొట్టిన ఆమ్లా
ఈ ఏడాది జనవరిలో విరాట్ కోహ్లీ మరో రికార్డుని హషీమ్ ఆమ్లా బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.

మరో కోహ్లీ రికార్డుని బద్దలు కొట్టిన ఆమ్లా
101 ఇన్నింగ్స్‌లో 5,000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు తన పేరిట నమోదు చేశాడు. అదే 5,000 పరుగులు చేరుకునేందుకు విరాట్ కోహ్లీ, సర్ వివిన్ రిచర్డ్స్‌లు 114 ఇన్నింగ్స్‌ను ఆడారు. వీరి రికార్డుని గత జనవరిలో హషీమ్ ఆమ్లా చెరిపేశాడు.

20 సెంచరీలు సాధించేందుకు తక్కువ వన్డేలాడిన ఆటగాళ్లు:
108 - హషీమ్ ఆమ్లా
133 - విరాట్ కోహ్లీ
175 - ఏబీ డెవిలియర్స్
197 - సచిన్ టెండూల్కర్
214 - సౌరభ్ గంగూలీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications