అరుదైన గౌరవం: ప్రపంచకప్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా హర్షా భోగ్లే
మెల్‌బోర్న్: ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత అయిన మన హైదరాబాదీ హర్షా భోగ్లేకు అరుదైన గౌరవం లభించింది. 2015లో తమ దేశంలో జరిగే క్రికెట్ ప్రపంచకప్‌కు పర్యాటక అంబాసిడర్‌గా హర్షాభోగ్లేను ఆస్ట్రేలియా నియమించింది.
మరో రెండునెలల్లో మొదలవనున్న ఈ ప్రపంచకప్‌కు భారత్ నుంచి వచ్చే అభిమానులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఆసీస్ టూరిజం శాఖ.. భోగ్లేను తమ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది. హర్భా భోగ్లేను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడంతోపాటు ఎయిర్ ఇండియా లాంటి పలు ఎయిర్ లైన్స్ సంస్థలతో కలిసి ఆస్ట్రేలియా టూరిజం 44రోజుల ప్రపంచ కప్ టోర్నీ కోసం పనిచేస్తోంది.

హ్యూస్‌కు అరుదైన గౌరవం: 13వ ఆటగాడిగా ఆసీస్ జట్టులో పేరు
అడిలైడ్: షిఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడుతూ సీన్ అబోట్ వేసిన బౌన్సర్ తలకు తగలడంతో గాయపడి, రెండు రోజుల తర్వాత మృతి చెందిన ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా అరుదైన గౌరవాన్ని అందించింది. భారత్‌తో జరిగే మొదటి టెస్టుకు ప్రకటించిన జట్టులో అతని పేరును 13వ ఆటగాడిగా చేర్చింది.
మరణించిన తర్వాత కూడా జట్టులో చోటు సంపాదించిన ఆటగాడిగా హ్యూస్ పేరు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ సర్ పీటర్ కాస్‌గ్రోవ్ సోమవారం ఆసీస్ ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. టెస్టు జట్టులో హ్యూస్ ఎప్పుడూ 13వ ఆటగాడిగా మీతోనే ఉంటాడని వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications